పిఎంఇండియా
విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం.. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం కోసం భారతదేశానికి చెందిన ‘‘అటల్ ఇనవేశన్ మిశన్’’ కు, రష్యా కు చెందిన ఫండ్ ‘‘టాలెంట్, సక్సెస్’’కు మధ్య కుదిరిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాన్ని (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది. ఉభయ దేశాల మధ్య విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు మరియు శాస్త్రవేత్తల రాక పోక ల ద్వారా సమన్వయ పూర్వక కృషి కి ఒక బలమైన పునాది ని వేయడం ఈ ఎంఒయు ను ఉద్దేశ్యం. ఈ ఎంఒయు పై 2018 వ సంవత్సరం, అక్టోబర్ 5 వ తేదీన సంతకాలయ్యాయి.
ప్రయోజనాలు:
ఈ ఎంఒయు భారతదేశం, రష్యా ల యొక్క విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు మరియు శాస్త్రవేత్తల రాక పోక ల ద్వారా విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానం రంగం లో ఉన్నతి తో పాటు సమన్వయ భరిత కృషి కి గట్టి పునాది ని వేయగలుగుతుంది.
ప్రభావం:
ఉభయ దేశాల లో పాఠశాల లు, విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సంస్థలు, ప్రత్యేక విద్యా సంస్థలు, హై-టెక్ కంపెనీలు, స్టార్ట్-అప్ లు, ఇంకా నూతన ఆవిష్కరణ కేంద్రాల తో సంబంధాలను ఏర్పరచుకోవడం లో పాలుపంచుకొనే యంత్రాంగాన్ని ఈ ఎంఒయు సమకూర్చుతుంది. ఈ కార్యకలాపాలు నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ జ్ఞానాన్ని సృష్టించడం లో, మేధోసంపత్తి ని ఆవిష్కరించడం లో, నూతన ఉత్పత్తుల ను అభివృద్ధి చేయడం లో చేదోడు గా నిలుస్తాయని ఆశిస్తున్నారు.
పూర్వరంగం:
ప్రధాన మంత్రి 2015వ సంవత్సరం, డిసెంబర్ 23వ, 24వ తేదీ లలో రష్యా ను సందర్శించినప్పుడు సోచి లో సిరియస్ ఎడ్యుకేషనల్ సెంటర్ కు వెళ్ళారు. అక్కడ రష్యన్ విద్యార్థులు భారతదేశానికి వెళ్లి భారతీయ విద్యార్థుల తో కలసి కృషి చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. 2018వ సంవత్సరం అక్టోబర్ నెల మొదటి వారం లో రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదీమిర్ పుతిన్ భారతదేశ సందర్శన కన్నా ముందు పది మంది రష్యన్ విద్యార్థులు భారత్ కు వచ్చారు. 2018వ సంవత్సరం, అక్టోబర్ 1-4 తేదీ ల మధ్య కాలం లో ఢిల్లీ లోని ఐఐటి లో ఏర్పాటైన ఒక ఇనవేశన్ బూట్ క్యాంపు లో 5 అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాల లకు చెందిన 10 మంది విద్యార్థుల తో కలసి పని చేయడం కోసమే రష్యన్ విద్యార్థులు వచ్చారు. వారందరు ఆరోగ్య సంరక్షణ, అంతరిక్ష సంబంధ సాంకేతిక విజ్ఞానం, స్వచ్ఛమైన సాంకేతిక విజ్ఞానం, వ్యవసాయ రంగ సాంకేతిక విజ్ఞానం మరియు స్మార్ట్ మొబిలిటీ.. ఈ అయిదు రంగాల లో నూతన మూల రూపాలను అభివృద్ధి పరచేందుకు అన్వేషణ కోసం కొత్త కొత్త ఆలోచన లపై దృష్టి సారించారు. యువ విద్యార్థి ఆవిష్కర్త లు తాము అభివృద్ధి చేసిన మూల రూపాల ను 2018వ సంవత్సరం, అక్టోబర్ 5వ తేదీ నాడు భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదీమిర్ పుతిన్ ల సమక్షం లో ప్రదర్శించారు.
భారతదేశానికి చెందిన అటల్ ఇనవేశన్ మిశన్ (ఎఐఎమ్) కు మరియు రష్యా కు చెందిన ఫండ్ ‘‘టాలెంట్, సక్సెస్’’కు మధ్య సహకార పూర్వక కృషి ని ఈ ఎంఒయు ద్వారా కొనసాగించాలని ప్రతిపాదించడమైంది.
**