Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విదేశాలు/సంస్థలతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) లు కుదుర్చుకున్న అవగాహనపూర్వక ఒప్పందాలకు కేంద్రం ఆమోదం


విదేశాలు/సంస్థలతో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) లు కుదుర్చుకున్న అవగాహనపూర్వక ఒప్పందాలకు (ఎంఓయూలకు) కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది.

ఎంఓయూలు ఈ కింద పేర్కొన్న పక్షాల మధ్య కుదిరాయి.. :

(i). నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు మధ్య ;

(ii). ఫెడ‌ర‌ల్ యాంటీ మోనోప‌లీ స‌ర్వీస్ ఆఫ్ ద ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్ కు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కు మ‌ధ్య‌ ;

(iii). ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ కు, సీసీఐ కి మ‌ధ్య‌ ;

(iv). డైరెక్టరేట్ జనరల్ ఫర్ కాంపిటీషన్ ఆఫ్ ద యూరోపియన్ కమిషన్ కు, సీసీఐ కీ మధ్య ;

(v). కెనడాలోని కాంపిటీషన్ బ్యూరో కు, సీసీఐ కీ మధ్య ;

(vi). యూఎస్ ఏ లోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ కి, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) కి మధ్య ;

(vii). యూకే లోని లండన్ కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ కు, ఐఐసీఏ కు మధ్య ;

(viii). ఇంటర్ నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు, ఐఐసీఏ కు మధ్య.

ఈ ఎంఓయూలపై సంతకాల వల్ల ఆయా సంస్థలతో విజ్ఞానాన్ని పంచుకోవ‌డానికి, సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, అనుభవాన్ని పంచుకోవడానికే కాకుండా ఆయా కార్యక్రమాల అమలులో సహకరించుకోవడానికి కూడామార్గం ఏర్పడుతుంది. ఎంఓయూల పరిధిలోకి వచ్చే అంశాలలో.. కార్పొరేట్

రెగ్యులేషన్, అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీషిప్ వంటి వృత్తులలో కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) వంటి అంశాలతో పాటు ఇతర అంశాలు కలసి ఉన్నాయి. వీటి ఫలితంగా బాధ్యతతో కూడిన వ్యాపార పద్ధతులు, కార్పొరేట్ డిస్ క్లోజర్స్, కార్పొరేట్ రిపోర్టింగ్ మొదలైన వాటికి మార్గం సుగమం అవుతుంది.

కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) లపై ఏర్పాటయ్యే ద్వైపాక్ష‌ిక కార్యాచరణ బృందం ఎంఓయూల అమలును పర్యవేక్షిస్తుంది.