Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విదేశీ-భారత ఆర్థిక నిఘా యూనిట్ల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై నవీకృత నమూనా అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం


విదేశీ-భారత ఆర్థిక నిఘా యూనిట్ల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై నవీకృత నమూనా అవగాహన ఒప్పందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎగ్మాంట్ గ్రూప్ నమూనా అవగాహన ఒప్పందం-2014 ఆధారంగా తాజా నమూనా అవగాహన ఒప్పందం నవీకరించబడింది.

నేపథ్యం:

విదేశీ ఆర్థిక నిఘా యూనిట్ల నుంచి అందే విజ్ఞాపనల పరిశీలన, పరిష్కార ప్రక్రియలే భారత-విదేశీ ఆర్థిక నిఘా యూనిట్ల ప్రధాన విధులు. అలాగే ఆయా విదేశీ యూనిట్లకు సమాచారం అందజేయడం, వాటితో సంబంధబాంధవ్యాలు నెలకొల్పుకోవడం, ఆయా విదేశీ యూనిట్ల మధ్య అవగాహన ఒప్పందాలకు తగిన వాతావరణ కల్పన, ఒప్పందాల ఖరారుపై సంప్రదింపులకు తోడ్పాటునివ్వడం కూడా ప్రధానాంశాలు. అధికశాతం విదేశీ సంస్థలకు సంబంధించి సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటే వాటి మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం అవసరమవుతుంది.

***