Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్ టిపి) 2004-09 లో భాగంగా టార్గెట్ ప్ల‌స్ స్కీము (టిపిఎస్‌)కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమ‌లుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్ టిపి) 2004-09 లో భాగంగా టార్గెట్ ప్ల‌స్ స్కీము (టిపిఎస్‌)కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమ‌లు చేయ‌డానికి ఆమోదం తెలిపింది. 2006 సంవ‌త్స‌రానికి చెందిన‌ సివిల్ అప్లికేష‌న్ నం. 554కు సంబంధించిన ఈ తీర్పు 2015 అక్టోబ‌ర్ 27న వెలువ‌డింది.

గౌర‌వ‌నీయ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్ర‌కారం టిపిఎస్ కింద వ‌చ్చే ఆదాయం దాదాపు 2700 కోట్ల రూపాయలు.

ఎఫ్‌టిపి కింద 2005-06 ఏడాదికిగాను మొద‌ట్లోనే ప్ర‌క‌టించిన ట‌ిపిఎస్ ప‌థ‌కం లోని అంశాల ప్ర‌కారం గ‌ల ద‌ర‌ఖాస్తుదారులైన ఎగుమ‌తిదారులంద‌రికీ దీని ద్వారా ల‌బ్ధి చేకూరుతుంది. అంతే కాదు విదేశీ వాణిజ్య విధానం 2004-09 లోగ‌ల అంశాల ప్ర‌కారం దేశ‌మంతా కూడా ఇది వ‌ర్తిస్తుంది.

2005-06కు సంబంధించిన టార్గెట్ ప్ల‌స్ స్కీము (టిపిఎస్) ను ఇప్ప‌టికే పాక్షికంగా అమ‌లు చేయ‌డం జ‌రిగింది. ఏది ఏమైన‌ప్ప‌టికీ స‌మీక్షాపూర్వ‌క నోటిఫికేష‌న్ కార‌ణంగా తోసిపుచ్చిన ఫిర్యాదులను 2006 సివిల్ అప్లికేష‌న్ నం. 554 లో సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన ప్ర‌కారం ఇప్పుడు సెటిల్ చేయ‌డం జ‌రుగుతుంది. ఈ స్కీమును 2006 ఏప్రిల్ 1వ తేదీ నుండి నిలిపివేయడమైంది.

2006 ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన వెలువ‌డిన నోటిఫికేష‌న్ నం. 48 లోని తేదీ వ‌ర‌కు, 2006 ఆగ‌స్టు 12న వెలువ‌డిన నోటిఫికేష‌న్ నం. 8 లోని తేదీ వ‌ర‌కు గ‌ల ఫిర్యాదుల‌ను ప్రారంభ నోటిఫికేష‌న్ ల ప్ర‌కార‌మే ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంది. ఆదాయ శాఖతో సంప్ర‌దించిన త‌రువాత డిజిఎఫ్ టి ప్ర‌ధాన కార్యాల‌యం రూపొందించిన నియ‌మ‌నిబంధ‌నావ‌ళి ప్ర‌కార‌మే ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంది. మంత్రివర్గం ఆమోదం పొందిన త‌రువాత ఒక ఏడాది లోపే ఈ ప‌నిని పూర్తి చేయాల‌ని ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది.

ఈ దిద్దుబాటు చర్య ప్ర‌భుత్వంతో గ‌ల‌ అనేక వ్యాజ్యాల‌కు స్వస్తి పలకనుంది. టిపిఎస్ కింద‌ గ‌ల ఫిర్యాదుల‌ను- గౌర‌వ‌నీయ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా- విదేశీ వాణిజ్య విధానం కింద‌ గ‌ల ప్రారంభ అంశాల ప్ర‌కారం ప‌రిష్కరించ‌డం జ‌రుగుతుంది.

పూర్వ రంగం

డిజి ఎఫ్‌టి వ‌ర్సెస్ క‌న‌క్ ఎక్స్ పోర్ట్స్ & ఓర్స్ పేరు మీద‌ గ‌ల సివిల్ అపీల్ నం. 554/2006 కు సంబంధించి గౌర‌వ‌నీయ సర్వోన్నత న్యాయస్థానం 27-10-2015న తీర్పునిచ్చింది. ఇది ఎగుమ‌తుల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన టార్గెట్ ప్ల‌స్ స్కీమ్ కు సంబంధించిన‌ది. ఈ తీర్పు ప్రకారం 2006 ఫిబ్ర‌వ‌రి 20న విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌ నం. 48/2005 (కొన్ని ఉత్ప‌త్తులకు అర్హ‌త లేకుండా చేయ‌డం జ‌రిగింది)ను గ‌త తేదీ ప్ర‌కారం అమ‌లు చేయ‌డం కుద‌ర‌దు. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన తేదీ నుండే ఇది అమ‌లులోకి వ‌స్తుంది. అలాగే ఈ తీర్పు ప్ర‌కారం టార్గెట్ ప్ల‌స్ స్కీముకు సంబంధించిన‌ 2006 జూన్ 12 తేదీన విడుద‌ల చేసిన‌ నోటిఫికేష‌న్ నం. 8/2006 (గ‌తంలోని 5, 10, 15 శాతం గ‌ల ధ‌ర‌ల త‌గ్గింపును 5 శాతానికి కుదించారు)ను గ‌త తేదీ ప్ర‌కారం అమ‌లు చ‌య‌డం కుద‌రదు. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన తేదీ నుండే ఇది అమ‌లులోకి వ‌స్తుంది