Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ లో ఇంట‌ర్ ప్రిట‌ర్స్ కాడ‌ర్ లో సంయుక్త కార్య‌ద‌ర్శి స్థాయి కి స‌మాన‌మైన రెండు ఉద్యోగాల ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ లో ఇంట‌ర్ ప్రిట‌ర్స్ క్యాడ‌ర్ లో సంయుక్త కార్య‌ద‌ర్శి స్థాయి కి స‌మాన‌మైన రెండు ఉద్యోగాల ఏర్పాటు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణ‌యం ఇంట‌ర్ ప్రిట‌ర్స్ కాడ‌ర్ లో ప్రావీణ్యాన్ని ఇనుమ‌డింప చేయ‌డం లోను, ఇంట‌ర్ ప్రిట‌ర్స్ సంబంధిత శిక్ష‌ణ తాలూకు ప్ర‌త్యేక అవ‌స‌రాల‌ను తీర్చ‌డం లోను తోడ్ప‌డగ‌ల‌దు.

భార‌త ప్ర‌భుత్వం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌త‌ స్థాయి ద్వైపాక్షిక మ‌రియు బ‌హుప‌క్షీయ అనుబంధాల‌ను గ‌ణ‌నీయంగా పెంచుకొంటున్న నేప‌థ్యం లో ఇంట‌ర్ ప్రిట‌ేశ‌న్ సంబంధిత అవ‌స‌రాలు పెరుగుతున్నందువ‌ల్ల, వాటిని తీర్చ‌డం లో ఈ చ‌ర్య ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించ‌గలుగుతుంది.

**