Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విప‌త్తుల‌ ను త‌ట్టుకునే మౌలిక‌ స‌దుపాయాల కోసం అంత‌ర్జాతీయ కూట‌మి ఏర్పాటు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


విప‌త్తుల‌ ను త‌ట్టుకొనే శ‌క్తి గ‌ల మౌలిక స‌దుపాయాల కోసం ఒక అంత‌ర్జాతీయ కూట‌మి (సిడిఆర్ ఐ) ఏర్పాటు కు, ఇందుకు మ‌ద్ద‌తు గా న్యూ ఢిల్లీ లో సెక్ర‌టేరియ‌ట్ కార్యాల‌యాన్ని నెలకొల్పడానికి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ఈ ప్ర‌తిపాద‌న‌ ను 2019వ సంవత్సరం ఆగ‌స్టు 13వ తేదీ న ప్ర‌ధాన‌ మంత్రి ఆమోదించారు.

సిడిఆర్ఐ ని 2019వ సంవత్సరం సెప్టెంబ‌ర్ 23 వ తేదీ న అమెరికా లోని న్యూ యార్క్‌ లో జ‌రిగే ఐక్య‌రాజ్య‌స‌మితి వాతావ‌ర‌ణ కార్యాచ‌ర‌ణ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా సిడిఆర్ఐ ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఐక్య‌ రాజ్య‌ స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశం, పెద్ద సంఖ్య‌ లో వివిధ దేశాల అధిప‌తుల‌ ను ఒక వేదిక‌ మీదకు తీసుకు రానుంది. జల వాయు పరివర్తన, తత్ఫలితం గా ఏర్ప‌డే విప‌త్తుల‌ ను ఎదుర్కొనేందుకు త‌మ త‌మ చిత్త‌శుద్ధి ని వ్య‌క్తం చేసేలా సిడిఆర్ఐ పట్ల ఉన్న‌త‌ స్థాయి లో శ్రద్ధ తీసుకొనేటట్టు ఇది చేస్తుంది.

మిగతా విషయాలకు తోడు ఈ దిగువన పేర్కొన్న చొర‌వ‌ల‌ కు సంబంధించి మంజూరును ఇవ్వడం జరిగింది:

(అ) న్యూ ఢిల్లీ లో సహాయక సచివాలయ కార్యాలయం సహా సిడిఆర్ఐ ని ఏర్పాటు చేయడం;

(ఆ) 1860 సొసైటీల రిజిస్ట్రేశన్ చ‌ట్టం కింద న్యూ ఢిల్లీ లో సిడిఆర్ఐ సెక్ర‌టేరియ‌ట్ ఏర్పాటు సిడిఆర్ఐ సొసైటీ పేరు మీద లేదా అందుబాటు లో ఉన్న అటువంటి పేరు తో ఏర్పాటు చేయడం;

సిడిఆర్ ఐ సొసైటీ మెమోరాండం ఆఫ్ అసోసియేశన్‌, దాని నిబంధ‌నల ను నేశన‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎమ్ఎ) త‌గిన స‌మ‌యం లో రూపొందించి ఖ‌రారు చేయ‌డం జ‌రుగుతుంది. 2019-20 నుండి 2023-24 మధ్య కాలాని కి సంబంధించిన అయిదు సంవత్సరాల కాలాని కి సెక్ర‌టేరియ‌ట్ కార్యాల‌యం ఏర్పాటు, ఆవర్త వ్యయాల‌ కోసం, ప‌రిశోధ‌క పథకాలు, సాంకేతిక‌ స‌హాయం కోసం అవ‌స‌ర‌మైన కార్ప‌స్ కోసం సిడిఆర్ఐ కి 480 కోట్ల రూపాయ‌ల (సుమారు గా 70 మిలియ‌న్ యుఎస్ డాల‌ర్ ల) భార‌త ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు కు సూత్ర ప్రాయం గా అంగీకారం ల‌భించింది. అలాగే ఆమోదం పొందిన చార్ట‌ర్ డాక్యుమెంట్ సిడిఆర్ఐ యొక్క మూల డాక్యుమెంట్‌ గా ఉంటుంది. ఎన్‌డిఎమ్ఎ ముఖ్య స‌భ్య‌త్వ దేశాల నుండి స‌మాచారాన్ని సేక‌రించిన అనంత‌రం విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌ ను సంప్ర‌దించి చార్ట‌ర్‌ కు తుది రూపు ను ఇవ్వడం జ‌రుగుతుంది.

కీల‌క ప్ర‌భావం

విప‌త్తులు, వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకునే మౌలిక స‌దుపాయాల‌ కు సంబంధించిన వివిధ కోణాల విష‌యం లో విజ్ఞాన స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డానికి ఒక వేదిక‌ గా సిడిఆర్ఐ ఉప‌యోగ‌ప‌డుతుంది.

వివిధ భాగ‌స్వాముల నుండి సాంకేతిక నైపుణ్యాన్ని ఇది ఒక చోటు కు చేర్చుతుంది. అలా చేయ‌డం వ‌ల్ల రిస్క్ , ఆర్థిక అవ‌స‌రాల‌ కు అనుగుణం గా మౌలిక స‌దుపాయాల అభివృద్ధి విష‌యం లో ఆయా దేశాల సామ‌ర్ధ్యాలు, కార్యాచ‌ర‌ణ‌ స్థాయి ని పెంచ‌డానికి ఇది ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.

ఇది స‌మాజం లోని అన్నివ‌ర్గాల వారికీ ప్ర‌యోజ‌న‌క‌రం గా ఉంటుంది. స‌మాజం లో ఆర్థికం గా బ‌ల‌హీన వ‌ర్గాలు , మ‌హిళ‌లు, పిల్ల‌ల వంటి వారు విప‌త్తుల ప్ర‌భావాని కి తీవ్రం గా గురి అవుతూ ఉంటారు. అందువ‌ల్ల విప‌త్తుల‌ ను త‌ట్టుకొని నిల‌బ‌డ‌గ‌ల మౌలిక స‌దుపాయాల‌ కు సంబంధించిన ప‌రిజ్ఞానం వ‌ల్ల వీరు ప్ర‌యోజ‌నం పొంద‌డానికి అవ‌కాశం ఉంటుంది. విప‌త్తుల ముప్పు ఎక్కువ‌ గా ఉన్న అన్ని రంగాల‌ కు ఇది వ‌ర్తిస్తుంది. భారతదేశం లో ఈశాన్య ప్రాంతం, హిమాల‌య ప్రాంతం భూకంపాలు రావ‌డానికి , కోస్తా ప్రాంతం తుపాను లు, సునామీ రావ‌డానికి , మ‌ధ్య‌ద్వీప‌క‌ల్ప ప్రాంతం క‌ర‌వుల‌ కు ఆస్కారం కలిగినటువంటి ప్రాంతాలు గా ఉన్నాయి.

నూతన ఆవిష్కరణ లు:

విప‌త్తు ముప్పు ను త‌గ్గించ‌డానికి సంబంధించి ఎన్నో చొర‌వ‌ లు ఉన్నాయి. అలాగే వివిధ దేశాల‌ లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి సంబంధించి విప‌త్తు ముప్పు అభివృద్ధి నేప‌థ్యం లో ఎన్నో కార్య‌క్ర‌మాలు ఉన్నాయి.

అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న‌ దేశాలు, అలాగే చిన్న‌, పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ కు , మౌలిక స‌దుపాయాల అభివృద్ధి లో ప్రాథమిక ద‌శ‌ లో ఉన్న దేశాలు, ముంద‌స్తు ద‌శ‌ లో ఉన్న దేశాలు, ఒక మోస్త‌రు నుండి పెద్ద విప‌త్తుల‌ ను త‌ట్టుకొనే శ‌క్తి గ‌ల దేశాల‌ కు సంబంధించి మౌలిక‌ స‌దుపాయాల అంత‌ర్జాతీయ కూట‌మి ఆయా దేశాల స‌మ‌స్య‌ల‌ ను తొల‌గించ‌గ‌లుగుతుంది.

ప‌లు కీల‌క చ‌ర్య‌లు సెందాయి ఫ్రేంవ‌ర్క్‌, సుస్థిరాభివృద్ధి ల‌క్ష్యాలు (ఎస్‌డిజి), జల వాయు పరివర్తన ల కూడ‌లి లో మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి తో ప‌నిచేస్తాయి.

విప‌త్తుల‌ ను త‌ట్టుకోగ‌ల మౌలిక స‌దుపాయాల పై దృష్టి సారించడం, న‌ష్టాల‌ ను త‌గ్గించే ల‌క్ష్యాల స‌మ‌స్య‌ ను సెందాయి ఫ్రేం వ‌ర్క్ కింద ప‌రిష్క‌రించ‌డానికి ఉప‌క‌రిస్తుంది. అలాగే అది ప‌లు సుస్థిరాభివృద్ధి ల‌క్ష్యాల స‌మ‌స్య‌ల‌ ను ఎదుర్కోగ‌ల‌దు. వాతావ‌ర‌ణ మార్పుల‌కు త‌ట్టుకునే విధంగా ప‌లు అంశాల‌కు దోహ‌ద‌ ప‌డుతుంది. అందువ‌ల్ల విప‌త్తుల‌ను త‌ట్టుకొనే మౌలిక‌ స‌దుపాయాల దిశ‌ గా అంత‌ర్జాతీయ కూట‌మి కి ప్ర‌త్యేక అవ‌కాశం ఉంది. భారతదేశం లోని వివిధ ప్రాంతాల‌ కు చెందిన ప్ర‌కృతి వైపరీత్యాల విషయం లో ముప్పు స‌మాచారాన్ని ప్ర‌చురించ‌డం వ‌ల్ల త‌మ ప్రాంతాల కు క‌లిగే న‌ష్టాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకో గ‌లుగుతారు. అలాగే ముప్పు ను తొల‌గించ‌డానికి, అందుకు తీసుకోవ‌ల‌సిన చుర్య‌లు, త‌మ త‌మ స్థానిక‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల నుండి స‌న్న‌ద్ధ‌త చ‌ర్య‌ల ను గురించి తెలుసుకోవ‌డానికి వీలు క‌లుగుతుంది.