పిఎంఇండియా
శ్రేష్ఠుడైన ప్రధాన మంత్రి శ్రీ గుయెన్ శువాన్ ఫుక్,
ప్రముఖ అతిథులారా,
షిన్ ఛావో
నాతో పాటు నా వెంట వచ్చిన ప్రతినిధి వర్గ సభ్యులకు సాదర స్వాగతం పలికినందుకు వియత్నాం ప్రభుత్వానికి, వియత్నాం ప్రభుత్వ నాయకత్వానికి నేను నా గుండె లోపలి నుండి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను.
మిత్రులారా,
వియత్నాం లో నేను పర్యటించడం వియత్నాంలో నేను పర్యటించడం మన రెండు సమాజాల, దేశాల మధ్య ఉన్న సంబంధాన్ని పెంచి పోషించడం కోసమే ఉద్దేశించినది. మన రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు చరిత్ర పరంగాను, నాగరికత పరంగాను లోతుగా వేళ్లూనుకొని ఉన్నాయి. అంతే కాకుండా ఇవి 2000 సంవత్సరాలకు పైబడి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సాంస్కృతిక బంధాలు అనేక రూపాలలో ప్రతిబింబిస్తున్నాయి. మరీ ముఖ్యంగా భౌద్ధానికి, హిందూ చామ్ నాగరికత స్మారకాలకు మధ్య ఉన్న బంధం సుస్పష్టం. ఇటీవలి కొన్ని దశాబ్దాలలో మన ప్రజల పురోగతి కోసం, సమృద్ధి కోసం మనం కలసి పంచుకున్న ఒక బలమైన కోరిక మన బంధాలకు ఒక ఆకృతిని కల్పించింది. భారతదేశంలో మేము మా విజ్ఞానాన్ని అనుభవాలను, ప్రావీణ్యాలను అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పంచుకోవాలని నమ్ముతాము. గత నాలుగు దశాబ్దాలుగా వియత్నాంతో మాకు ఉన్న బహుముఖీన ద్వైపాక్షిక సహకారం విజయవంతం కావడం కన్నా దీనికి అత్యుత్తమమైన ఉదాహరణ మరొకటి కనిపించదు. ద కూ లాంగ్ డెల్టా రైస్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ మన సహకారం ఎంతమేరకు విస్తరించింది అన్నదానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలచింది. మెకాంగ్ డెల్టాలో ఒక సంస్థను ఏర్పాటు చేయడంలో, వ్యవసాయ నిపుణులను భారతదేశానికి పంపడంలో, సంస్థ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో భారతదేశం సహాయపడింది. ఇవాళ వియత్నాం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వరి ఎగుమతిదారుగా పేరు తెచ్చుకుంది. వియత్నాం వరిని ఉత్పత్తి చేసే మరియు వరిని ఎగుమతి చేసే ప్రధాన దేశంగా అవతరించడంలో వియత్నాంతో చేతులు కలిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
మిత్రులారా,
భాగస్వాములుగా మనం మన శక్తియుక్తులను కలబోసుకొని ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడంలోను, నూతన అవకాశాలను అన్వేషించడంలోను పరస్పరం ప్రయోజనాన్ని తప్పక పొందాలి. మనం ఇప్పుడు మన సంబంధాన్ని మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి దీనిని “ఒక సమగ్రమైన వ్యూహత్మక భాగస్వామ్యం”గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాము. ఇది ఎంతో సంతృప్తిని కలిగిస్తున్న విషయం. వచ్చే సంవత్సరంలో మనం దౌత్య సంబంధాలను నెలకొలుపుకొని 45వ వార్షికోత్సవాన్ని, అలాగే వ్యూహత్మక భాగస్వామ్యాని ఏర్పరచుకొని 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ రెండు మైలు రాళ్లను మనం చేరుకోవడానికి ఇంకా కొన్ని నెలల కాలమే మిగిలి ఉంది.
మిత్రులారా,
భారతదేశం- వియత్నాం ల మధ్య ఒక ధృఢమైన భాగస్వామ్యమంటూ ఏర్పడితే అది మన ప్రజలతో పాటు ఒక సువిశాల ప్రాంతంలో శాంతికి, సుస్థిరత్వానికి, అభివృద్ధికి, సమృద్ధికి దారి తీయగలదు. భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి వియత్నాం ఒక ధృఢమైన స్తంభం లా నిలబడింది. విభిన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల పైన పరస్పర విశ్వాసం, అవగాహన, కేంద్రీకరణ లపై ఆధారపడి మన ద్వైపాక్షిక బంధం కొనసాగుతున్నది.
శ్రేష్టుడైన ప్రధానమంత్రి గారు, సోదర సోదరీమణులారా,
ఈ విందుకు నాతో కలసి ముందుకు రావలసిందిగా మీ అందరినీ ఆహ్వానించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.
హిజ్ ఎక్స్ లెన్సీ, వియత్నాం సామ్యవాద గణతంత్ర ప్రధాన మంత్రి శ్రీ గుయెన్ శువాన్ ఫుక్ తో పాటు ఇక్కడ గుమికూడిన మీ అందరి ఆరోగ్యం, ఆనందాల కోసం; ఇంకా,
వియత్నాం ప్రజల క్షేమ, సౌభాగ్యాల కోసం;
భారతదేశం మరియు వియత్నాం ల మైత్రి చిరకాలం కొనసాగడం కోసం మనమంతా ఈ విందులో పాలుపంచుకొందాము.