పిఎంఇండియా
అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు. వివాదాల స్థానంలో చర్చలకు ప్రాధాన్యం పెరగడాన్ని, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు నమ్మకంతో బలోపేతం కావడాన్ని, అభివృద్ధి ప్రగతికి కొత్త మార్గాలను తెరుస్తోందని ఈ వ్యాసంలో పేర్కొన్నారు. గత దశాబ్దంలో సాకారమైన సహకార సమాఖ్య విధానంలో వచ్చిన మార్పులు, విశ్వాసంతో మనం ఎంత దూరం ముందుకు సాగాం, ఏమేమి సాధించామనే అంశాలను ఈ వ్యాసం విశ్లేషించింది.
“వివాదాల స్థానంలో సంభాషణకు ప్రాధాన్యం పెరుగుతోంది. విశ్వాసం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేస్తోంది. అభివృద్ధి ప్రగతికి కొత్త మార్గాలను తెరుస్తోంది. అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తన తాజా వ్యాసంలో – గత దశాబ్దంలో సాకారమైన సహకార సమాఖ్య విధానంలో వచ్చిన మార్పును చక్కగా విశ్లేషించారు. మనం ఎంత దూరం ముందుకు వచ్చాం, విశ్వాసంతో ఏమేమి సాధించామనే విషయాలను ఆత్మపరిశీలన చేసుకునేలా ఈ వ్యాసం సాగింది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
Dialogue is replacing disputes, trust is strengthening Centre-state relations and development is opening new pathways for progress.
— PMO India (@PMOIndia) September 17, 2026
In his latest piece, Assam CM Shri @himantabiswa explores the shift in cooperative federalism realised in the last decade.
An introspective read… https://t.co/Ykg9ZtF9ft