Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వివిధ పండుగ ల‌ను పుర‌స్క‌రించుకొని దేశవ్యాప్త ప్ర‌జ‌ల‌ కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్ర


వివిధ పండుగ ల‌ను పుర‌స్క‌రించుకొని దేశం లోని ప్రజలందరి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన తన సందేశాల ను వరుస గా ఈ కింద పేర్కొన్న విధం గా ట్విటర్ లో పొందుపరచారు.

‘‘వివిధత్వం లో ఏక‌త్వం యొక్క పర్వం. సోద‌ర‌భావం మ‌రియు స‌ద్భావ‌న స్ఫూర్తి ని మ‌నం పండుగ వలె జ‌రుపుకొంటున్నాం. రానున్న రోజుల‌ లో దేశ‌ం అంతటా ప్ర‌జ‌లు వేరు వేరు రకాలైన పండుగ‌ ల‌ను జ‌రుపుకోబోతున్నారు. ఆయా సంద‌ర్భాల ను పుర‌స్క‌రించుకొని ప్ర‌తి ఒక్క‌ వ్యక్తి కి ఇవే నా శుభాకాంక్ష‌లు. ప్ర‌తి ఒక్క‌రి జీవ‌నం లో సంతోషాన్ని, ఇంకా స‌మృద్ధి ని ఆ ఈశ్వరుడు క‌లుగజేయు గాక‌!’’

‘‘మీ అంద‌రికీ బైశాఖి శుభాకాంక్ష‌లు. బైశాఖి దీవెన‌ లు మీకు అంద‌రి కి ల‌భించు గాక‌. ఈ మంగ‌ళ‌ప్ర‌ద‌మైన రోజు ప్ర‌తి ఒక్క‌రి జీవనం లో చ‌క్క‌ని ఆరోగ్యాన్ని మ‌రియు సాఫ‌ల్యాన్ని అందజేయు గాక‌. క‌ష్ట‌ించి ప‌నిచేస్తూ మ‌న దేశ ప్ర‌జానీకాని కి ఆహారాన్ని అందిస్తున్న‌టువంటి రైతుల‌ కు ఇవే మ‌న అందరి వంద‌నాలు.’’

‘‘హుషారైన ఒడియా స‌ముదాయాని కి సంతోష‌దాయ‌క‌మైనటువంటి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. క్రొత్త ఆకాంక్ష‌లను మ‌రియు స‌రిక్రొత్త ఆశ‌ ల‌ను కొత్త సంవ‌త్స‌రం అందించు గాక‌. ఈ మ‌హా విశుబ సంక్రాంతి మీ యొక్క కోరిక‌ల‌న్నింటి ని నెర‌వేర్చు గాక‌. ప్ర‌తి ఒక్క‌రి కి సంతోషాన్ని మరియు శ్రేయాన్ని ప్రసాదించాలంటూ ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’

‘‘త‌మిళ నాడు కు చెందిన నా ప్రియ సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా, రానున్న నూతన సంవ‌త్స‌రం మీకు అందరికీ ఒక అపూర్వ‌మైన సంవత్సరం గా ఉండాలంటూ ఆ ఈశ్వ‌రుడి ని ప్రార్థిస్తున్నాను. నా యొక్క సోద‌రీమ‌ణుల‌ కు మ‌రియు సోద‌రుల‌ కు పుథండు శుభాకాంక్ష‌లు. రానున్న సంవ‌త్స‌రం లో ఆ ఈశ్వరుడు మ‌న అంద‌రి ఆకాంక్ష‌ ల‌ను నెర‌వేర్చు గాక‌. ప్ర‌తి ఒక్క‌రూ సంతోషం గా, చ‌క్క‌ని ఆరోగ్యం తో ఉండు గాక.’’

******