పిఎంఇండియా
దేశం లో వివిధ రంగాల కు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుడుల (ఎఫ్ డిఐ) విధానాన్ని సమీక్షించాలన్న ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ప్రధాన ప్రభావం మరియు ఎఫ్ డిఐ విధాన సంస్కరణ తో ప్రయోజనాలు
i. ఎఫ్ డిఐ విధానం లో మార్పుల వల్ల భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు ఆకర్షణీయ గమ్యం గా మారుతుంది. తద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, వృద్ధి ల వంటి ప్రయోజనాలు సమకూరుతాయి.
ii. బొగ్గు రంగం లో బొగ్గు విక్రయాల కోసం ఆటోమేటిక్ రూట్ లో బొగ్గు తవ్వకాల కు, మౌలిక సదుపాయాలు సహా శుద్ధి సంబంధిత అనుబంధ కార్యకలాపాల కు 100 శాతం ఎఫ్ డిఐ వల్ల అంతర్జాతీయ పోటీదారులు ఆకర్షితులు కావడం ద్వారా సమర్థమైన మరియు స్పర్థాత్మకమైన బొగ్గు విపణి ఆవిష్కృతం అవుతుంది.
iii. అంతేకాకుండా కాంట్రాక్టు విధానం లో తయారీ కి వీలు కలిగి ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్య సాధన కు తోడ్పడుతుంది. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతి న ఆటోమేటిక్ రూట్ లో తయారీ కి ఎఫ్ డిఐ ని అనుమతించడం వల్ల తయారీ రంగాని కి కొత్త ఉత్తేజం లభిస్తుంది.
iv. సింగిల్ బ్రాండ్ రిటేల్ వాణిజ్యం (ఎస్ బిఆర్ టి)లో ఎఫ్ డిఐ పై స్థానిక నిబంధనల సడలింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెటు ప్రసంగం లో ప్రకటించారు. దీనివల్ల అటువంటి వ్యాపార సంస్థల కార్యకలాపాల కు మరింత సరళత్వం, సౌలభ్యం లభిస్తుంది. అంతేకాక ఒక ప్రాతిపదిక సంవత్సరం లో అత్యధిక ఎగుమతులు చేసే కంపెనీల కు సమాన స్పర్థావకాశాల ను సృష్టించినట్లు అవుతుంది. దీనితో పాటు ప్రస్తుత విపణి విధానాల కు అనుగుణం గా ప్రత్యక్ష స్టోర్ల ఏర్పాటు కు ముందు ఆన్ లైన్ విక్రయాల కు అనుమతిచ్చే విధానం రూపొందుతుంది. ఆన్ లైన్ అమ్మకాలు రవాణా రంగం లో ఉపాధి అవకాశాల తో పాటు వినియోగదారుల సంరక్షణ, డిజిటల్ చెల్లింపులు, శిక్షణ, ఉత్పత్తుల పై నైపుణ్య కల్పన వంటి వాటి కి దోహదపడుతాయి.
v. దేశం లో వాణిజ్య సౌలభ్య కల్పన దిశ గా ఎఫ్ డిఐ విధానాన్ని ఇంకా సరళతరం, సులభతరం చేయడానికే పైన పేర్కొన్న సవరణల ను ప్రతిపాదించడమైంది. దీని వల్ల దేశం లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగి, పెట్టుబడుల తో పాటు ఆదాయం, ఉపాధి అవకాశాలు కూడా పెరిగేందుకు తోడ్పడుతుంది.
పూర్వరంగం
ఆర్థిక వృద్ధి కి ప్రధాన చోదకం గానే కాక దేశ ఆర్థిక అభివృద్ధి కి రుణ రహిత ద్రవ్య వనరు గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ను పరిగణించాలి. అందుకే ప్రభుత్వం పెట్టుబడిదారు సంస్థలకు సన్నిహితంగా ఉండేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని తీసుకు వచ్చింది. దీనిలో భాగం గా అనేక రంగాలు/ కార్యకలాపాల లోకి ఆటోమేటిక్ రూట్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు అనుమతి ని ఇచ్చింది. ఆ మేరకు ఇటీవలి కాలం లో వివిధ రంగాల కు సంబంధించి భారతదేశాన్ని ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యం గా రూపొందించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధాన నిబంధనల ను ప్రగతిశీలం గా సరళీకరించింది. వీటి లో రక్షణ, నిర్మాణాభివృద్ధి, వాణిజ్యం, ఔషధాలు, పవర్ ఎక్స్ఛేంజెస్ సహా బీమా, పింఛను, ఇతర ఆర్థిక సేవ లు, అసెట్ రికన్ స్ట్రక్షన్ కంపెనీ లు, ప్రసార మాధ్యమాలు మరియు పౌర విమానయానం వంటి రంగాలు భాగం గా ఉన్నాయి.
ఈ సంస్కరణలు గత అయిదు సంవత్సరాలు గా భారతదేశం రికార్డు స్థాయి లో ఎఫ్ డిఐ ను ఆకర్షించడం లో తోడ్పడ్డాయి. భారతదేశం లో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2009-10 నుండి 2013-14 మధ్య అయిదు సంవత్సరాల కాలం లో ఇది 189 బిలియన్ యుఎస్ డాలర్ గా ఉన్నవి కాస్తా 2014-15 నుండి 2018-19 మధ్య కాలం లో 286 బిలియన్ యుఎస్ డాలర్ గా నమోదైంది. నిజాని కి, 2018-19 లో 64.37 బిలియన్ యుఎస్ డాలర్ గా నమోదైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (తత్కాలీన అంచనా) ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా వచ్చినటువంటి అత్యధిక స్థాయి ఎఫ్ డిఐ గా ఉంది.
అంతర్జాతీయం గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం కొన్నేళ్ల నుండి ఒడుదొడుకుల ను ఎదుర్కొంటోంది. వాణిజ్యం-అభివృద్ధి పై ఐక్య రాజ్య సమితి సదస్సు (యుఎన్ సిటిఎడి) ప్రపంచ పెట్టుబడుల నివేదిక- 2019 ప్రకారం.. అంతర్జాతీయం గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 2018వ సంవత్సరం లో 13 శాతం మేర పతనమై, అంతక్రితం సంవత్సరం తో పోలిస్తే 1.5 ట్రిలియన్ అమెరికా డాలర్ స్థాయి నుండి 1.3 ట్రిలియన్ డాలర్ స్థాయి కి పడిపోయింది. అది వరుసగా మూడో వార్షిక పతనం. అంతర్జాతీయం గా ఇలాంటి దీన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు భారతదేశం ఆకర్షణీయ గమ్యం గా కొనసాగుతూనే ఉంది. అయితే, మరింత అధికం గా పెట్టుబడుల ను ఆకర్షించగల సామర్థ్యం మన దేశానికి ఉందన్న భావన బలపడిన నేపథ్యం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధాన వ్యవస్థ ను మరింత సరళం, మరింత సులభం చేయడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించే వీలు ఏర్పడింది.
ఈ నేపథ్యం లో భారతదేశాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు మరింత ఆకర్షణీయ గమ్యం గా తీర్చిదిద్దే దిశగా ఎఫ్ డిఐ ల కింద ప్రయోజనాల ను మరింత స్థిరీకరించేలా కేంద్ర ఆర్థిక మంత్రి 2019-20 బడ్జెటు లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. దీని కి అనుగుణం గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం లో అనేక సవరణలను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాల ను దిగువ విభాగాల లో చూడవచ్చును.
బొగ్గు తవ్వకాలు
ప్రస్తుత ఎఫ్ డిఐ విధానం ప్రకారం… విద్యుత్తు ప్రోజెక్టు లు, ఇనుము- ఉక్కు, సిమెంటు కర్మాగారాలు సహా వివిధ చట్టాల వర్తింపు తో పాటు నియంత్రణ ల కింద అనుమతి గల ఇతర కార్యకలాపాల ను నిర్వహించే సంస్థ ల సొంత వినియోగం కోసం బొగ్గు- లిగ్నైట్ తవ్వకాల కోసం 100 శాతం ఎఫ్ డిఐ ని ఆటోమేటిక్ రూట్ లో ప్రభుత్వం అనుమతిస్తోంది. అంతేకాకుండా ఆయా సంస్థ లు బొగ్గు తవ్వకాల ను చేపట్ట రాదని, శుద్ధి చేసిన- పరిమాణీకరించిన బొగ్గు ను బహిరంగ విపణి లో విక్రయించరాదనే, పంపిణీ చేయరాదనే షరతుల తో బొగ్గు శుద్ధి ప్లాంటులు వంటివి ఏర్పాటు చేయడానికీ 100 శాతం ఎఫ్ డిఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తోంది. ఆ మేరకు శుద్ధి కార్యకలాపాల కోసం తమ కు ముడి బొగ్గు ను సరఫరా చేసే సంస్థల కు మాత్రమే అవి శుద్ధి చేసిన, పరిమాణీకరించిన బొగ్గు ను సరఫరా చేయవలసివుంటుంది.
ఈ నేపథ్యం లో బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) చట్టం-2015, గనులు- ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957, వాటి కి తరచుగా చేసే సవరణల కు లోబడి బొగ్గు శుద్ధి సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన సహా బొగ్గు విక్రయాల కు, బొగ్గు తవ్వకాల కు 100 శాతం ఎఫ్ డిఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించాలని నిర్ణయించింది. బొగ్గు శుద్ధి, ముక్కలు చేయడం, బొగ్గు నిర్వహణ, వేరుపరచటం (అయస్కాంత-అయస్కాంతేతర) వంటి కార్యకలాపాలు ‘‘శుద్ధి సంబంధింత మౌలిక సదుపాయాల’’ కిందకు వస్తాయి.
కాంట్రాక్ట్ మాన్యూఫాక్చరింగ్
• ప్రస్తుత ఎఫ్ డిఐ విధానం తయారీ రంగం లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ను ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తోంది. కాంట్రాక్ట్ మాన్యూఫాక్చరింగ్ కు సంబంధించి ఈ విధానం లో నిర్దిష్ట నిబంధన ఏదీ లేదు. ఈ నేపథ్యం లో కాంట్రాక్ట్ మాన్యూఫాక్చరింగ్ పై స్పష్టత ను ఇచ్చే దిశ గా ఈ రంగం లోనూ 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వయంచాలక మార్గం లో అనుమతించాలని నిర్ణయించింది.
• విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం నిబంధనల కు లోబడి ‘తయారీ’ రంగం లో విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ గానే వస్తాయి. పెట్టుబడిదారు సంస్థ స్వయం గా లేదా కాంట్రాక్టు పద్ధతి న చట్టబద్ధ రక్షణ గల ఒప్పందం కింద ప్రధాన సంస్థ లేదా ప్రధాన సంస్థ నుండి ప్రాతినిధ్య సంస్థ ప్రాతిపదిక న భారతదేశం లో తయారీ కార్యకలాపాల ను చేపట్టవచ్చు.
సింగిల్ బ్రాండ్ రిటేల్ ట్రేడింగ్ (ఎస్ బిఆర్ టి)
i. ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం ప్రకారం.. సింగిల్ బ్రాండ్ రిటేల్ ట్రేడింగ్ లో విదేశీ సంస్థ కు 51 శాతం పెట్టుబడులు ఉన్నట్లయితే విక్రయ వస్తు విలువ లో 30 శాతం వస్తువుల ను భారతదేశం లో సేకరించాలన్న నిబంధన ఉంది. అంతేకాకుండా స్థానిక వనరుల నిబంధన కు సంబంధించి తొలి అయిదు సంవత్సరాల లో దీని ని అమలు చేయవచ్చు.. ఆ తరువాత భారతదేశం లో కార్యకలాపాల కింద దీని ని వార్షికం గా అమలు చేయాలి. సింగిల్ బ్రాండ్ చిల్లర వర్తక సంస్థల కు మరింత వెసులుబాటు ను, కార్యకలాపాల లో సౌలభ్యాన్ని కల్పించే దృష్టి తో సంబంధిత సంస్థ సదరు సింగిల్ బ్రాండ్ కోసం భారతదేశం లో చేసే కొనుగోళ్లు అన్నిటి ని స్థానిక మూలాల నుండి సేకరించినట్లే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భం గా సదరు వస్తువుల సేకరణ, విక్రయాలు భారతదేశం లో జరిగాయా, ఎగుమతుల రూపం లో జరిగాయా అన్నదాని తో నిమిత్తం లేదు. ఎగుమతుల ను అయిదు సంవత్సరాల పాటు మాత్రమే అనుమతించాలన్న పరిమితి ని తొలగించడం ద్వారా ఎగుమతుల కు ఉత్తేజమివ్వాలని కూడా నిర్ణయించింది.
ii. స్థానిక వనరుల సేకరణ నిబంధన కు సంబంధించి, సింగిల్ బ్రాండ్ రిటేల్ ట్రేడింగ్ చేపట్టే భారతేతర సంస్థ లు ప్రత్యక్షం గా లేదా వారి అంతర్గత కంపెనీ ల ద్వారా ప్రపంచ స్థాయి వ్యాపార కార్యకలాపాల కోసం పెరిగే వనరుల సేకరణ ను కూడా మొదటి 5 సంవత్సరాలకు గాను స్థానిక వనరుల సేకరణ నిబంధన ను పాటించినట్లుగానే ప్రస్తుత విధానం పరిగణిస్తుంది. అయితే, వర్తమాన వర్తక నమూనాల్లో సంస్థ లేదా దాని అంతర్గత సంస్థల ద్వారా అంతర్జాతీయ కార్యకలాపాల కోసం భారతదేశం నుండి వనరుల ను సేకరించడమే కాకుండా సంబంధం లేని తృతీయ పక్షం ద్వారా కూడా సింగిల్ బ్రాండ్ చిల్లర వర్తక సంస్థ లేదా దాని అంతర్గత కంపెనీల ఆదేశాల మేరకు సేకరిస్తారు. ఇటువంటి వ్యాపార కార్యకలాపాల ను కూడా విధానం కిందకు తేవడం లో భాగం గా ‘‘అంతర్జాతీయ కార్యకలాపాల కోసం భారతదేశం నుంచి సేకరణ’’ను సదరు సింగిల్ బ్రాండ్ చిల్లర వర్తక సంస్థ లేదా దాని అంతర్గత సంస్థ లు చట్టబద్ధ రక్షణ గల ఒప్పందం కింద నేరు గా లేదా మూడో పక్షం ద్వారా చేపట్టేందుకు అనుమతించాలని నిర్ణయించింది.
iii. అంతర్జాతీయ వనరుల సేకరణ లో మునుపటి సంవత్సరపు విలువ ను మించిన భాగాన్ని మాత్రమే స్థానిక సేకరణ గా పరిగణించాలని ప్రస్తుత విధానం నిర్దేశిస్తోంది. అయితే, ఏటికేడాది పెరిగే ఎగుమతుల విలువ ను పరిగణన లోకి తీసుకునే ఇటువంటి నిబంధన వల్ల ప్రాతిపదిక సంవత్సరం లో కంపెనీల ఎగుమతులు తక్కువ స్థాయి లో ఉంటే వాటి వ్యవస్థ లో ఒడుదొడుకుల కు ఆస్కారం ఉంది. అదే సమయం లో తదుపరి సంవత్సరాల్లో ఏదైనా ఒక ఏడాది లో ప్రస్తుత నిబంధన ను పూరించుకొనే వీలు కూడా ఉంటుంది. అలాగే ఎగుమతులు నిలకడ గా హెచ్చు స్థాయిలో గల కంపెనీ పట్ల ఈ నిబంధన విచక్షణ చూపినట్లు అవుతుంది. అందుకే అంతర్జాతీయ కార్యకలాపాల కోసం భారతదేశం నుండి వనరుల సేకరణ మొత్తాన్నీ (పెరుగుదల విలువ తో నిమిత్తం లేకుండా) స్థానిక సేకరణ గానే పరిగణించాలని ప్రభుత్వం తాజా గా నిర్ణయించింది.
iv. ఎలక్ట్రానిక్- వాణిజ్యం ద్వారా తమ చిల్లర వర్తకం ప్రారంభించడానికి ముందు సింగిల్ బ్రాండ్ చిల్లర వర్తకపు కంపెనీ లు దేశం లో ప్రత్యక్షంగా స్టోర్ల ను ప్రారంభించాలని ప్రస్తుత విధానం నిర్దేశిస్తోంది. దీని వల్ల ప్రస్తుత మార్కెట్ విధానాల తో మమేకం కావడం లో కృత్రిమ ఆంక్షల ను విధించినట్లు అవుతుంది. అందువల్ల ఆన్ లైన్ వ్యాపారం మొదలుపెట్టిన తేదీ నుండి రెండు సంవత్సరాల లోగా ప్రత్యక్షం గా స్టోర్లు ప్రారంభించాలన్న షరతు తో సదరు సంస్థల వ్యాపార ప్రారంభాని కి అనుమతించాలని నిర్ణయించింది. ఇలా ఆన్ లైన్ వర్తకాని కి అనుమతి ఇవ్వడమన్నది రవాణా రంగం లో ఉపాధి అవకాశాలతో పాటు వినియోగదారు సంరక్షణ, డిజిటల్ చెల్లింపులు, శిక్షణ, ఉత్పత్తుల పై నైపుణ్య కల్పన వంటి వాటి కి దోహదపడుతుంది.
డిజిటల్ ప్రసార మాధ్యమాలు
టీవీ చానెళ్ల ‘వార్తలు-వర్తమాన వ్యవహారాల’ అప్-లింకింగ్ కోసం ప్రస్తుత విధానం ప్రకారం ముందస్తు అనుమతి తో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలు ఉంది. ఈ నేపథ్యం లో తాజా గా ప్రచురణ మాధ్యమాల తరహా లో డిజిటల్ మాధ్యమాల ద్వారా వార్తలు-వర్తమాన వ్యవహారాల ప్రసారాని కి ప్రభుత్వ అనుమతి ద్వారా 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ను పొందే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
**