పిఎంఇండియా
ధైర్యం, వివేకం, దూరదృష్టి కలిగి ఉంటూ చేసే పనులతో సంతోషం, సౌభాగ్యం సిద్ధిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి నిర్ణయాన్నీ ఎంతో ఆలోచించి తీసుకోవాలనీ, ముందువెనుక ఆలోచించి చేసే పనులే విజయాన్ని అందిస్తాయనీ ఆయన తెలిపారు.
‘‘సహసా విద్ధీత్ న క్రియామవివేకః పరమాపదాం పదమ్ వృణతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపద’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఆలోచించకుండా ఏ పనీ చేయకూడదు.. అలా చేసే పని గొప్ప ఆపదలను తెచ్చిపెడుతుంది. దీనికి భిన్నంగా, ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగు వేసే వ్యక్తి చెంతకు విజయం, సౌభాగ్యం నడిచి వస్తాయని ఈ సుభాషితం మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ, ‘‘ధైర్యం, వివేకం, దూరదృష్టితో చేసే పనులే సంతోషానికీ, సౌభాగ్యానికీ కారణమవుతాయి. ఇందువల్ల ప్రతి నిర్ణయాన్నీ అన్నీ ఆలోచించి మరీ తీసుకోవాలి.. ఎందుకంటే, ముందువెనుక ఆలోచించి వేసే అడుగులే విజయాన్ని అందిస్తాయి.
సహసా విద్ధీత్ న క్రియామవివేకః పరమాపదాం పదమ్
వృణతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపద’’ అని పేర్కొన్నారు.
धैर्य, विवेक और दूरदर्शिता से किए गए कार्यों से ही सुख-समृद्धि के द्वार खुलते हैं। इसलिए हर निर्णय में पूरी समझदारी जरूरी है, क्योंकि सोच-समझकर उठाया गया कदम ही सफलता का आधार बनता है।
— Narendra Modi (@narendramodi) June 16, 2026
सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्।
वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः॥ pic.twitter.com/X1DlFfR06j