Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విశాఖ‌ప‌ట్నంలో అంత‌ర్జాతీయ యుద్ధ నౌక‌ల స‌మీక్ష‌- 2016 కు హాజ‌రైన‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ యుద్ధ నౌక‌ల స‌మీక్ష‌- 2016 (ఐఎఫ్ఆర్-2016) కు హాజ‌ర‌య్యారు. భార‌త‌దేశ రాష్ట్రప‌తి స‌మ‌క్షంలో ఈ రోజు జ‌రిగిన ద ఫ్లీట్ రివ్యూ అండ్ ఫ్లైపాస్ట్ కార్య‌క్ర‌మాలు ప్ర‌పంచం అంత‌టి నుంచి వ‌చ్చిన నౌకాద‌ళాల‌ను ఒక చోటుకు తీసుకు రావ‌డంతో పాటు, భార‌తీయ నౌకాద‌ళం ప‌రాక్ర‌మాన్ని చాటిచెప్పాయి.

స‌ముద్ర సంబంధిత ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న భార‌తీయ నౌకాద‌ళం సాంకేతిక విజ్ఞాన శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు అద్దం ప‌ట్టింది. ప్ర‌ద‌ర్శ‌న ప్రాంగ‌ణంలోనే ఏర్పాటు చేసిన క‌ళ‌లు, హ‌స్త‌క‌ళ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా ఆయ‌న చూశారు. ఈ క‌ళాకృతులు, హ‌స్త‌క‌ళ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దేశం న‌లు మూల‌ల నుంచి హ‌స్త‌క‌ళాకారులు త‌మ ఉత్ప‌త్తుల‌ను తీసుకువ‌చ్చి ప్ర‌ద‌ర్శించారు.

ఇండియ‌న్ నేవీ సింఫ‌నిక్ ఆర్కెస్ర్టా స‌మ‌ర్పించిన ద ప్రెసిడెన్షియ‌ల్ బ్యాండ్ కాన్స‌ర్ట్ కు కూడా ప్ర‌ధాన మంత్రి హాజ‌రయ్యారు.

విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ యుద్ధ నౌక‌ల స‌మీక్ష‌లో భాగంగా రేపు విన్యాసాల ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌ధాన మంత్రి వీక్షించ‌నున్నారు. ఒక కార్యక్ర‌మంలో ఆయ‌న పాల్గొని, ప్ర‌సంగించ‌నున్నారు.