పిఎంఇండియా
విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన చేతి వృత్తుల వారికి, శిల్పులకు, నిర్మాణ కార్యకలాపాల్లో భాగం పంచుకుంటున్న నైపుణ్యం గల కార్మికులకు శ్రీ మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ ఆశయ సాధనలో చేతి వృత్తుల వారు, నైపుణ్యం గల కార్మికుల ప్రావీణ్యం, అంకిత భావం, కష్టించి పని చేసే స్వభావాలకు ఎనలేని ప్రాముఖ్యం ఉందని ప్రధానమంత్రి అన్నారు. దేశ నిర్మాణం దిశగా వారు చేస్తున్న కృషికి చేతనైన అన్ని విధాలుగా సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
భగవాన్ విశ్వకర్మకు సంబంధించిన శాశ్వత జ్ఞానాన్ని గుర్తుచేసే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా ప్రస్తావించారు:
‘‘అనాదిరప్రమేయశ్చ అరూపశ్చ జయాజయః
లోకరూపో జగన్నాథః విశ్వకర్మన్నమో నమః’’.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మీకందరికీ అనేకానేక శుభకామనలు.
దేవశిల్పితో సంబంధం గల ఈ దివ్య దినోత్సవం సందర్భంగా.. దేశం నలుమూలలా నిర్మాణ పనులలో నిమగ్నమైన ప్రతిభ గల శిల్పకారులకు, నైపుణ్యం గల చేతివృత్తి కళాకార సహచరులకు నా ప్రత్యేక అభినందనలు.
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’ సంకల్పాలను సాకారం చేయడంలో మీ నైపుణ్యం, శ్రమ చాలా కీలకం.
దేశ నవనిర్మాణం దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం లభించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ విషయంలో మేం పూర్తిస్థాయి నిబద్ధతను కలిగి ఉంటాం.
అనాదిరప్రమేయశ్చ అరూపశ్చ జయాజయః
లోకరూపో జగన్నాథః విశ్వకర్మన్నమో నమః’’ అని పేర్కొన్నారు.
आप सभी को भगवान विश्वकर्मा जयंती की बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) September 17, 2026
देवशिल्पी से जुड़े इस दिव्य अवसर पर निर्माण कार्यों में जुटे देशभर के शिल्पकारों एवं हुनरमंद साथियों को मेरा विशेष अभिनंदन।
आपका कौशल एवं परिश्रम विकसित और आत्मनिर्भर भारत के संकल्प को साकार करने में अत्यंत महत्वपूर्ण… pic.twitter.com/wiw8Ek9dpq