మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు, ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ మనోహర్ లాల్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే గారు, శ్రీమతి సునేత్ర అజిత్ పవార్ గారు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, పూణే నగరానికి చెందిన నా ప్రియమైన సోదరీసోదరులారా!
దీపావళి పండుగ సమీపిస్తోంది. దీపావళి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
మిత్రులారా,
ప్రజల జీవితాల్లో కొత్త సౌకర్యం చేకూరినప్పుడు పండగల ఆనందం మరింత పెరుగుతుంది. పూణే ప్రజలకు నేడు అటువంటి సంతోషకరమైన సందర్భం. పూణే మెట్రోలో మరో మార్గాన్ని ఈ రోజు ప్రారంభించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పదేళ్ల కిందట, పూణేలో ఈ ప్రాజెక్టు మొదటి దశకు శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు హింజేవాడి-శివాజీనగర్ మధ్య మెట్రో సేవలు ప్రారంభం కావడంతో, పూణేలోని ప్రధాన ఐటీ కేంద్రాల్లో ఒకటి మెరుగైన రవాణా అనుసంధానాన్ని పొందుతుంది. నేడు పనులు ప్రారంభమైన ఈ కొత్త మార్గం… పూణేలోని పాత, కొత్త ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ సందర్భంలో పూణే, మహారాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
గుర్తింపును నిర్వచించేవారు. ప్రస్తుతం నగరాల గుర్తింపు కోసం మరో రెండు కొలమానాలు అందుబాటులోకి వచ్చాయి. మొదటిది, ఒక నగర పోటీతత్వం. రెండోది, అది అందించే జీవన సౌలభ్య స్థాయి. మెట్రో ప్రాజెక్టులు ఏ నగరానికైనా ఈ రెండు పారామితులను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పూణే మెట్రో విస్తరిస్తున్న కొద్దీ, అది ఈ నగరవాసుల సమయాన్ని ఆదా చేస్తూ, మరింత సౌకర్యాన్నీ అందిస్తోంది. ఒక నగరం సమయం ఆదా అయినప్పుడు, దాని ఉత్పాదకత పెరుగుతుందని మనందరికీ తెలుసు. ఒక నగరం ఉత్పాదకత పెరిగినప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పుడు… పేదలు, మధ్యతరగతి ప్రజలూ ప్రయోజనం పొందుతారు.
ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాం. నగరాల్లో నివసించే మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, రవాణా సౌకర్యాలను సులభతరం చేయడమే ఆ సంకల్పం. నేడు మనం దాని ఫలితాలను చూడవచ్చు. గత పన్నెండేళ్లలో దేశంలో మెట్రో రవాణా వ్యవస్థ పూర్తిగా రూపాంతరం చెందింది. 2014లో 248 కిలోమీటర్లుగా ఉన్న మెట్రో నెట్వర్క్, నేడు దాదాపు 1,200 కిలోమీటర్లకు విస్తరించింది. 2014లో కేవలం అయిదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు, ప్రస్తుతం 26 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. నేడు ప్రతిరోజూ కోటి మందికి పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం భారత మెట్రో నెట్వర్క్ ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి మెట్రో నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచింది.
మరో కారణంతోనూ ప్రత్యేకమైనది. ఈ మెట్రో మార్గాన్ని ‘పీపీపీ’ నమూనాలో నిర్మిస్తున్నారు. అంటే, ప్రభుత్వం, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో ఇది రూపుదిద్దుకుంటుంది. ఇది దేశ పురోగతిని మరింత వేగవంతం చేసే ఒక విజయవంతమైన అభివృద్ధి నమూనా.
కార్యకలాపాలకు కూడా అవి ప్రధాన కేంద్రాలు.
దేశవ్యాప్తంగా ఉన్న వందలాది చిన్న నగరాలను మనం అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి. ఈ
దృక్పథంతోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ను ఆమోదించాం. ఈ నిధి కోసం కేంద్ర
ప్రభుత్వం రూ. 1 లక్ష
కోట్ల సహాయాన్ని అందిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు
అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే దీని లక్ష్యం. స్థానిక సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన మన
మిత్రులు, ఇతరులందరూ
ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం మిషన్ మోడ్‌లో పనిచేయాలి. ఈ
ప్రయత్నంలో మహారాష్ట్ర తన పాత్రను మరింత పెంచుకుంటుందని నేను నమ్ముతున్నాను.
జయిస్తోంది.
మిత్రులారా,
నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా
ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగానూ, అత్యంత వేగంగా పేదరికాన్ని నిర్మూలిస్తున్న దేశంగానూ భారత్
నిలిచింది. ఈ రెండు విజయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ
శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత బడ్జెట్ పెరుగుతోంది. ప్రజలపై చేసే
పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతంలో కుంభకోణాలు, పక్షపాతం, లీకేజీల వల్ల మాయమైన డబ్బు
ఇప్పుడు నేరుగా లబ్ధిదారులకే చేరుతోంది. దేశ వనరులను రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో వ్యవస్థల్లో పెట్టుబడిగా పెట్టినప్పుడు.. విద్యుత్, నీరు, గ్యాస్ పైప్లైన్ల విషయంలో ప్రభుత్వం ఖర్చును పెంచినప్పుడు ప్రజల జీవితాలు మెరుగుపడటంతో పాటు ఉపాధి అవకాశాలుకూడా పెరుగుతాయి.
ఉద్దేశం. పేద ప్రజలను వేదికపైకి ఆహ్వానించేవాళ్లం. వారు
పేదరికాన్ని జయిస్తామని ప్రతిజ్ఞ చేసి రెట్టింపు నమ్మకంతో ఇళ్లకు తిరిగి
వెళ్లేవారు.
మిత్రులారా,
పాతిక సంవత్సరాల క్రితం నేను
ప్రారంభించిన ఈ పని ఈరోజుకీ నిరంతరాయంగా సాగుతోంది. దీనినే నేను ‘పవర్ టు ఎంపవర్’ అని అంటాను. పవర్ టు ఎంపవర్ అనేది
నిజమైన సుపరిపాలన. ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. గత ప్రభుత్వాలు కేవలం
నినాదాలు ఇవ్వడానికే పరిమితమై అలసిపోయాయి. కానీ మనం ప్రతీ లింక్‌ను అనుసంధానించాం.
కోట్ల మంది జీవిత కలలను ఒకచోట పేర్చాం. ఎన్నో ఏళ్ల క్రమబద్ధమైన, నిశితమైన ప్రయత్నాల ఫలితమే ఇది.
అందుకే ఈ రోజు యాభై కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని జయించారు.
పరిస్థితుల వల్ల అనేక వ్యవసాయ కుటుంబాలు ఇబ్బందులను
ఎదుర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా దేవేంద్ర ఫడ్నవీస్ గారి నాయకత్వంలో నీటి
సంరక్షణపై ఎంతో కృషి జరిగింది. కానీ ఈ ప్రకృతి విపత్తు తీవ్రమైన సవాళ్లను విసిరింది. మహారాష్ట్రలోని ప్రతీ రైతు సోదరీసోదరుడికి నేను ఒక హామీ ఇవ్వాలనుకుంటున్నాను.. ఈ కష్టసమయంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సానుభూతి, కట్టుబాటుతో మీ వెంటే బలంగా నిలబడుతుంది. మహారాష్ట్రలో ఉన్న కరువు పరిస్థితుల గురించి నాకు అవగాహన ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు సహాయాన్ని కూడా అందించింది. నేను పీఎం-కిసాన్ నిధులను కూడా విడుదల చేశాను. దయచేసి ఎలాంటి ఆందోళన చెందకండి. మేం ప్రతీ రైతుకు అండగా నిలుస్తున్నాం.
శుభాభివందనాలు. చాలా ధన్యవాదాలు. పుణె ప్రజలారా..
మీ రెండు చేతులూ పైకెత్తి పూర్తి శక్తితో నాతో అనండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
గమనిక: ప్రధానమంత్రి హిందీ, మరాఠీలో ప్రసంగించారు.
***
A better-connected Pune is a faster-growing Pune! New Metro projects will boost the city's growth and improve Ease of Living. https://t.co/CZzZ6clgJ2
— Narendra Modi (@narendramodi) November 3, 2026
IT, automobile, pharma, startups... Innovation से लेकर manufacturing तक, पुणे...देश के युवाओं के लिए सपनों और संकल्पों का स्थान है। और ऐसे में मजबूत होती यहां की metro connectivity...पुणे शहर के विकास को नई गति देने जा रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2026
हमारे शहर केवल रहने की जगह नहीं हैं। ये देश की Economic Activity के बड़े केंद्र भी हैं। हमें देश के सैकड़ों छोटे शहरों को Growth Hubs भी बनाना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2026
आज भारत वो देश है... जो Fastest Growing economy भी है और Fastest Poverty reducer भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2026