పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. ఇరాన్, భారత్ ల మధ్య దౌత్య, అధికారిక/ సేవ, సాధారణ పాస్‌పోర్టులు ఉన్నవారికి వీసా విధానాన్ని సులభతరం చేసేందుకు చేసుకున్న ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు:
(i) దీని కారణంగా, వీసా దరఖాస్తుతో పాటు స్థానిక విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటును జతపరిస్తే.. ఆతిథ్య దేశంలోని దౌత్య కార్యాలయం ప్రతినిధి 20 రోజుల్లోగా ఉచిత వీసాను ఇవ్వాల్సి ఉంటుంది. ఆతిథ్య దేశంలో లేదా కాన్సులేట్స్ జనరల్‌లో ఎక్కువ రోజులు పని ఉండే దౌత్య, అధికారిక, సేవ పాస్‌పోర్టు ఉన్నవారికి ఈ వీసా 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. పరిస్థితిని బట్టి కుటుంబ సభ్యులను (రక్త సంబంధీకులు – తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు) కలిసేందుకు ఉచితంగా.. ఇతర కుటుంబ సభ్యులు మిగిలిన వారిని కలిసేందుకు వచ్చే వారికి రుసుమును తీసుకుని వీసా ఇవ్వనున్నారు.
(ii) ద్వైపాక్షిక చర్చలు, సెమినార్లలో పాల్గొనేందుకు వెళ్లే రాజకీయ నాయకులు, అధికారులకు విదేశీ మంత్రిత్వ శాఖ ఇచ్చే నోటు ఆధారంగా అధికారులు పొడిగించేందుకు వీలులేని ఉచిత ప్రవేశ వీసా మూడు పనిదినాలలో, 15 రోజుల చెల్లుబాటుతో ఇస్తారు.
(iii) పలుమార్లు వెళ్ళే వారికి 3 నెలల చెల్లుబాటున్న ఉచిత ప్రవేశ వీసాలో, ప్రతిసారి వెళ్లినపుడు కనీసం 20 పనిదినాలలో పాటు ఆతిథ్య దేశంలో ఉండాలి. దౌత్య సంబంధ కార్యక్రమాలు, కాన్సులేట్స్ జనరల్ పనులపై, ఆర్థిక, తనిఖీ, ఐటీ, కంప్యూటర్ అధికారులు ఇచ్చే ఈ వీసాలను 15 పనిదినాలలో ఇవ్వాల్సి ఉంటుంది.
(iv) తాత్కాలిక దౌత్య కార్యాలయం లేదా కాన్సులేట్స్ జనరల్‌లో ప్రత్యేక పరిపాలనా అవసరాల కింద ఒకసారి వెళ్ల గలిగే మూడు నెలల చెల్లుబాటుతో ఉండే ఉచిత వీసాలను 15 పనిదినాలలో ఇస్తారు.
(v) టీచర్లు, వారి జీవిత భాగస్వామి, పిల్లలకు ఒకసారి మాత్రమే వెళ్లగలిగే సేవ/ అధికారిక ఉచిత మూడు నెలల వీసాను విదేశీ మంత్రిత్వ శాఖ నోటు ఆధారంగా 20 పనిదినాలలో ఇస్తారు.
(vi) రెండు దేశాల అధికారులు న్యాయ, సాంప్రదాయ విషయాలకు అనుగుణంగా అన్ని అంశాలపై చర్చించుకున్న తర్వాత ఒప్పందాలు మార్చుకున్న తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది.
(vii) దీని అమలుకు కచ్చితమైన కాలపరిమితి లేదు. రెండు వర్గాల్లో ఎవరైనా. కనీసం 60 రోజుల ముందస్తు నోటీసుతో దౌత్య వర్గాలకు సమాచారం ఇవ్వటం ద్వారా ఈ ఒప్పందాన్నిరద్దు చేసుకోవచ్చు.
(viii) ఏ దేశమైనా ఆ దేశ చట్టాలు, నిబంధనల ప్రకారం అవతలి దేశం జాతీయులను దేశంలోకి అనుమతించకపోవటం, పర్యటనను కుదించటం, పర్యటన రద్దు చేసే హక్కును కలిగి ఉంటుంది.
(ix) రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంయుక్తంగా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. ఒప్పందంలో చేర్చాల్సిన, చేర్చిన అంశాలు, అమలుపై ఏవైనా సందేహాలు, వివాదాలుంటే.. దీన్ని రెండు వర్గాలు చర్చలు కలసి కూర్చుని చర్చించుకోవాలని నిర్ణయించారు.