Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వృత్తివిద్య-శిక్షణ రంగంలో సహకారంపై భారత-బెలారస్ మధ్య అవగాహన ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం


బెలార‌స్‌లో పెద్ద‌సంఖ్య‌లో ప‌రిశ్ర‌మలున్నాయి. ప్ర‌త్యేకించి భారీ ప‌రిశ్ర‌మలు, తయారీరంగ సంస్థ‌ల‌కు ఆ దేశం నెల‌వుగా ఉంది. అందుబాటులో ఉన్న నైపుణ్య కార్మిక‌శ‌క్తితో, అత్యున్న‌త నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ వ్య‌వ‌స్థ‌తో భారీ ప‌రిశ్ర‌మ‌ల నిల‌యంగా బెలార‌స్ రూపొందింది. మ‌న దేశంలో చేప‌ట్టిన “మేక్ ఇన్ ఇండియా”, “నైపుణ్య భార‌తం” వంటి కార్య‌క్ర‌మాల‌కు అక్క‌డి నైపుణ్యాభివ‌ద్ధి విధాన ప‌రిజ్ఞాన బ‌దిలీ ఇతోధికంగా తోడ్ప‌డుతుంది. భార‌త్‌లో ప్ర్య‌త్యేకించి త‌యారీ రంగంలో కార్మిక‌శ‌క్తిని నైపుణ్య‌మైన‌దిగా తీర్చిదిద్ద‌టానికి బెలార‌స్‌లోని నైపుణ్యాన్ని, ప‌రిజ్ఞానాన్ని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో బ‌దిలీ చేసుకోవ‌డానికి ఈ అవ‌గాహ‌న ఒప్పందం బాట‌లు ప‌రుస్తుంది.

వృత్తివిద్య-శిక్షణ రంగంలో గుర్తించిన అంశాల‌కు సంబంధించి రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారం వ్య‌వ‌స్థాగ‌త భాగ‌స్వామ్యాల ఏర్పాటు ద్వారా అమ‌ల‌వుతుంది. ఈ మేర‌కు బెలార‌స్‌లో వృత్తివిద్యాభివృద్ధికి సంబంధించి అత్యున్న‌తమైన “రిప‌బ్లిక‌న్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ వొకేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్” (RIPO), “డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ట్రెయినింగ్” మ‌ధ్య వృత్తి విద్యాభ్యాసం, దాని సుస్థిర కొన‌సాగింపు దిశ‌గా సాంకేతిక‌త బ‌దిలీకి ఈ భాగ‌స్వామ్యం ఏర్పాట‌వుతుంది. ఈ మేర‌కు నైపుణ్యాభివృద్ధి ప‌ర్యావ‌ర‌ణంపై ప‌రిశోధ‌న‌, అభివృద్ధికి సంబంధించి బెలార‌స్‌లోని రంగాల‌వారీ వృత్తివిద్య-శిక్ష‌ణ/నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు ప్ర‌తిపాదించ‌బ‌డింది.

సహకారంలో కింది అంశాలు కూడా భాగంగా ఉంటాయి:

1. బెలార‌స్ వైపునుంచి స‌మ‌గ్ర ప‌రిజ్ఞానం బ‌దిలీ అవుతుంది. ఇందులో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక‌త‌లు, శిక్ష‌ణ‌-మూల్యాంక‌న పద్దతులు, క్ర‌మ‌బ‌ద్ధ/దూర/ఈ-అభ్య‌స‌నంతోపాటు బోధ‌కుల శిక్ష‌ణ కోసం బోధ‌నాంశాల రూప‌క‌ల్ప‌న, సామ‌ర్థ్యాభివృద్ధికి సంబంధించి మ‌దింపుదారుల సామ‌ర్థ్య నిర్మాణం, నెట్‌వ‌ర్క్ రూప‌క‌ల్ప‌న‌-ప‌రిశ్ర‌మ‌ల‌తో సంధానం వంటివి అంత‌ర్భాగంగా ఉంటాయి;

2. నిర్మాణ‌రంగం, విద్యుదుత్పత్తి-పంపిణీ, ఉత్పాదక పరిశ్రమ, వాణిజ్యం, యాంత్రిక సేవ‌లు, గృహోపకరణాల మరమ్మత్తు-నిర్వహణ, రవాణా, స‌మాచార రంగం, హోటళ్లు-రెస్టారెంట్లుస‌హా భార‌త‌దేశంలో అధిక డిమాండుగ‌ల‌ ఇతర రంగాలలో నైపుణ్యం పెంపు దిశ‌గా భారత పౌరులకు వృత్తి విద్యా సేవలు అందించ‌డం;

3. బెలార‌స్ త‌ర‌ఫున భారత్‌లోని శిక్ష‌ణ నిర్వాహ‌కుల‌కు, బోధ‌కుల‌కు, శిక్ష‌కుల‌కు పునఃశిక్ష‌ణ‌, నైపుణ్య స్థాయి పెంపుతోపాటు వృత్తివిద్యలో శిక్ష‌ణ‌;

4. ప్ర‌ణాళిక‌, నిర్వ‌హ‌ణ‌, నైపుణ్యాభివృద్ధి, వృత్తివిద్య-శిక్ష‌ణ‌నివ్వ‌డంలో మెరుగుద‌ల దిశ‌గా స‌ల‌హా సేవ‌లు అందించ‌డం;
ప్ర‌ధాన ప్ర‌భావం:

• దేశంలో నైపుణ్య ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ బ‌హుముఖంగా మెరుగుప‌డే దిశ‌గా బెలార‌స్ అనుభ‌వాన్ని, నైపుణ్యాన్ని ఈ అవ‌గాహ‌న ఒప్పందం ద్వారా పొందే వీలు క‌లుగుతుంది.

• వృత్తివిద్యా రంగంలో ప‌రిశోధ‌న‌, అభివృద్ధిద్వారా ప్ర‌స్తుత వృత్తివిద్య-నైపుణ్యాభివృద్ధిలో మెరుగుద‌ల‌-ఆవిష్కరణలు కూడా ఈ ప్ర‌తిపాద‌న‌ల అమ‌లులో అంత‌ర్భాగంగా ఉంటాయి.

ఈ అవ‌గాహ‌న ఒప్పంద చ‌ట్రం ప‌రిధిలో చేప‌ట్టే స‌హ‌కారాత్మ‌క కార్య‌క‌లాపాల కోసం ఆర్థికప‌ర‌మైన‌ ఏర్పాట్లపై నిధుల ల‌భ్య‌త ఆధారంగా ఏ అంశానికి ఆ అంశంపై రెండు ప‌క్షాలూ ప‌ర‌స్ప‌ర అంగీకారానికి రావాల్సి ఉంటుంది.