పిఎంఇండియా
మాననీయ ఛైర్మన్ గారూ,
ఘనమైన సభాసదులారా,
మన సహచరులలో కొంత మంది ఇక్కడ సంపాదించిన అనుభవం తో సమాజ సేవలో వారు పోషించవలసినటువంటి పాత్ర ను మరింత సమర్ధంగా పోషించగలరన్న పూర్తి నమ్మకం నాకుంది. ఈ సభ లో నుండి వైదొలగుతున్న ప్రతి ఒక్క గౌరవనీయ మెంబరు తన వంతు తోడ్పాటు ను అందించారు; వారిలో ప్రతి ఒక్కరికీ వారిదైనటువంటి ప్రాముఖ్యం ఉన్నది; వారిలో ప్రతి ఒక్కరు దేశ భవిష్యత్తు ను ప్రకాశవంతంగా మలచడం కోసం ఈ సభ లో సభ్యులుగా వారి శాయశక్తుల పాటుపడ్డారు; ఈ దేశం వారిని ఎన్నటికీ మరువజాలదు.
శ్రేష్ఠమైన సేవలను అందించిన మీ అందరినీ నేను అభినందిస్తున్నాను; మరి రానున్న కాలంలో మీరు చల్లగా ఉండాలంటూ మీకు నేను నా యొక్క శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను.
ఈ సభ కొందరు తలపండిన సీనియర్ సభ్యులది; వారు తమ జీవితంలో గడించిన అనుభవం ఈ సభ కు విలువ ను జోడించింది.
పెద్దల సభ అయినటువంటి ఈ సభ తో పాటు ఈ సభ లోని సీనియర్ సభ్యులు భవిష్యత్తు లో సమాజానికి ఏది మంచిది, ఏది మంచిది కాదు అనే అంశాలను పరిగణన లోకి తీసుకోగలిగిన మరియు సామాజిక జీవనం యొక్క ఆశలను ఆకాంక్షలను పక్షపాతానికి తావు లేనటువంటి రీతిలో తూచగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు.
మరి ఈ కారణంగా ఇక్కడ పలికే ఎలాంటి పలుకులైనా వాటికి ఒక ప్రత్యేకమైన విలువ ఉన్నది; ఆ మాటలకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యం కూడా ఉంది. మరి ఆ ప్రాముఖ్యమే మన విధాన రూపకల్పన లో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ వస్తోంది.
మనం జీవితంలో వృత్తి నైపుణ్యాన్ని కలిగివుండటంతో పాటు ఒక తపస్వి వలె తన జీవనాన్ని గడిపిన మాన్య శ్రీ పరాశరన్ గారు వంటి ప్రముఖులు మన మధ్య ఉన్నారు. మన మధ్య ఉన్నటువంటి ఆ కోవకు చెందిన వారి నుండి ఈ సభ ఇకపై ప్రయోజనం పొందలేకపోతుంది.
భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఇరువురు.. శ్రీమాన్ దిలీప్ గారు మరియు సచిన్ గారు.. ఈ ఆటగాళ్లు రానున్న రోజులలో మన మధ్య ఉండబోరు; మరి వారి సాహచర్యం తాలూకు లాభాలను మనం పొందలేం.
ప్రొఫెసర్ కురియన్ సాహెబ్ ను ప్రజలు ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకొంటారు. ఆయన నగుమోము ను చూసి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే.. ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు దానిని ఒక దరహాసంతో చెప్పాలన్నది; ఇది ఆయన ఆయన లోని విశిష్ట లక్షణంగా ఉండింది. మరి ఈ కారణంగానే, సభను సంక్షోభ సమయాలలో సైతం ఒక సక్రమ పద్ధతి లో నడిపించడం లో ఆయన పోషించిన పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర గా మారిపోయింది.
మన మధ్య ఏదైనా ఒక పార్టీ నేపథ్యం లేనటువంటి వారు గాని, లేదా వారి యొక్క పార్టీకి చెందిన సిద్ధాంతంతో సంబంధం లేనటువంటి వారు గాని చాలా తక్కువ మంది ఉంటారు అనడం యథార్థమే. అటువంటి వారు ఎంతో అరుదు. మనలో చాలా మందికి ఏదో ఒక విధమైనటువంటి నేపథ్యం ఉంది. ఈ కారణంగా అటువంటి అభిప్రాయాలను ఇక్కడ ప్రతిష్ఠించే ప్రయత్నాలు చేయడం అనేది స్వాభావికం అవుతుంది. అంతేకాక అది అత్యంత సహజమైన పని కూడాను.
అయితే, లోక్ సభ లో జరిగేదంతా రాజ్య సభ లో సైతం జరగాలి అని ఆశించవలసిన అవసరం ఏమీ లేదు కూడాను. మరి, అందుకని, ప్రతి ఒక్కరు వారిదైన రీతిలో సొంత పాత్రను పోషించారు. ఎందుకంటే, పెద్దల సభ కు తనదైన స్వీయ ప్రాముఖ్యం అంటూ ఉంది.
సభలో ఆఖరి సమావేశం కాబట్టి నేను ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను అని ఆలోచన చేసిన వారు; ఫలానా చారిత్రక ప్రసంగం చేసిన తరువాత నేను సభలో నుండి వైదొలగుతాను కాబట్టి నేను ఈ రకంగా ఉపన్యసించేందుకు నేను సన్నాహాలు చేసుకొంటాను అని ఆలోచన చేసిన వారు; ఈ అభిప్రాయాలను వెల్లడి చేసిన అనంతరం నేను సభ నుండి తప్పుకొంటాను. దేశం కోసం ఏదైనా ముఖ్యమైన పని ని చేసి సభ నుండి వెనుదిరుగుతాను అనేటటువంటి ఆలోచనలు చేసిన వారు.. మీలో చాలా మంది ఉండే వుంటారని నేను విశ్వసిస్తున్నాను. ఏమైనప్పటికీ, ఉద్యోగ విరమణ సమయంలో ఆ తరహా అవకాశం బహుశా మీకు లభించి వుండక పోవచ్చు. ఇది ఆవలి పక్షం యొక్క బాధ్యతేమీ కాదు; మీరు ఈ విధంగా సభ నుండి వైదొలగుతున్నారూ అంటే అది మా అందరి బాధ్యత.
మీ ఉద్యోగ విరమణ సమయంలో ఒక అత్యంత ముఖ్య నిర్ణయంలో కీలకమైన పాత్రను పోషించిన అనంతరం తప్పుకొనే అవకాశాన్ని మీరు పొంది ఉండి వున్నట్లయితే కొన్ని మంచి అంశాలను అందించిన అనంతరం విశ్రాంతి ని తీసుకొని ఉండి వున్నట్లయితే అప్పుడు అది శ్రేష్ఠతరమైందిగా ఉండేది; ఇంకా, ఒక బాధ్యతను నిర్వర్తించామన్న ప్రత్యేక భావన మీకు కూడా కలిగేది.
ఏమైనప్పటికీ, సభ లో నెలకొన్న వాతావరణం కారణంగా మీకు మంచి అవకాశం దొరకలేదేమో. నిన్న అయితే, ఇవాళ్టి అవకాశం కూడా మీకు దక్కదేమో అని అనిపించింది. ఏమైనా, మాననీయ ఛైర్మన్ గారు ఎంతో కష్టపడి, ప్రతి ఒక్కరిని ఒప్పించే ప్రయత్నం చేశారు; ఆయన అందరినీ కలుపుకు పోవాలని చూశారు. శ్రీమాన్ విజయ్ గారు కూడా యథాశక్తి తోడ్పడ్డారు.
కాబట్టి చివరకు ఈ రోజు వైదొలగుతున్న సభ్యులందరూ వారి వారి అంతరంగ భావాలను వ్యక్తం చేయడం అనేది సాధ్యపడింది. అయితే, ఇంత జరిగినా, ఒక ముఖ్యమైన నిర్ణయంలో- ఏ నిర్ణయాన్ని అయితే చరిత్ర సదా స్మరించుకోనుందో- అందులో తోడ్పాటు ను అందించే ఒక కడపటి అవకాశాన్ని మీ ఉద్యోగవిరమణ సందర్భంలో మీరు కోల్పోయారు. మీ ఉద్యోగావధి లోనే మీకు అవకాశం చిక్కింది దానిని మీరు వినియోగించుకొన్నారు కూడాను; కానీ, ఆ ఆఖరి అవకాశాన్ని మాత్రం మీరు చేజార్చుకొన్నారు.
రానున్న రోజులలో భారతదేశ చరిత్ర లో ఒక అమిత ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే ‘మూడు సార్ల తలాక్’ వంటి కీలకమైన నిర్ణయాలను తీసుకోవలసి వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మీరు కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి ఎన్నికైన వారికి ఈ అవకాశం లభించనుంది. అయితే, ఈ రోజున వైదొలగుతున్న వారు చారిత్రకంగా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొనే అవకాశాన్ని పోగొట్టుకొన్నారు. మరి దీని తాలూకు వేదన కు మీరు లోనవుతారని, అది ఈ రోజున కాకున్నా తదుపరి పది, ఇరవై లేదా ఇరవై అయిదు సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా జరిగేదేనని నేను నమ్ముతున్నాను. వీటన్నింటినీ మనం సాధించి వుంటే అప్పుడు అది మరింత బాగుండేది.
ఈ రోజు వైదొలగుతున్న మాన్య సభ్యులు అందరికీ నేను మరొక్క మారు నా యొక్క శుభాకాంక్షలను తెలియ జేస్తున్నాను. మీలో ఒకరుగా మీకు నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఈ సభ యొక్క ద్వారాలు ఈ రోజుతో ఇక మీకు మూసివేయబడతాయని మీరు భావించ వద్దు అన్నదే. ఈ ఆవరణ యొక్క తలుపులు మీకోసం తెరచే ఉంటాయి. ప్రధాన మంత్రి కార్యాలయం యొక్క తలుపులు మీకోసం బార్లా తెరచే ఉంటాయి.
దేశ హితాన్ని దృష్టి లో పెట్టుకొని, మీకు తట్టే ఎలాంటి ఆలోచనలను అయినా సరే, అవి మీకు ఎప్పుడు తట్టినా సరే- వాటిని పంచుకోవడం కోసం- మీకు ఇదే ఆహ్వానం, స్వాగతమూను. మరి మీ వాణిని వినడానికి నేను సంసిద్ధుడినై వుంటాను; మీరు చెప్పే దానిని గురించి వినడానికి సహర్షంగా నేను వేచి వుంటాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను మీ ఆలోచన లను మరియు మీ తోడ్పాటు ను ముందుకు తీసుకు పోవడానికి నేను తప్పక కృషి చేస్తాను.
మీ అందరికీ మరొక్క మారు నా వైపు నుండి అనేకానేక ధన్యవాదాలు; మీ అందరికీ నును నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
***
We bid farewell to some of our MP colleagues in the Rajya Sabha. They have contributed significantly to Parliament and we have all gained from their experience and insight: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) March 28, 2018
The Rajya Sabha is a distinguished House, with eminent members serving here. This House plays a vital role in our democracy: PM @narendramodi https://t.co/0Tbiv8imV6
— PMO India (@PMOIndia) March 28, 2018
We will always remember the distinguished work of Parasaran Ji. Who can forget the manner in which Professor Kurien has contributed to the Rajya Sabha: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) March 28, 2018
We will always remember the distinguished work of Parasaran Ji. Who can forget the manner in which Professor Kurien has contributed to the Rajya Sabha: PM @narendramodi in the Rajya Sabha
— PMO India (@PMOIndia) March 28, 2018