పిఎంఇండియా
ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. దేశానికి వారు చేస్తున్న సేవలు, చూపుతున్న కరుణ, నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యుల కృషి, దయ, అంకితభావం.. భారతదేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థకు కీలక ఆధారమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వారు నిరంతరం అందిస్తున్న సేవలు.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజల విశ్వాసాన్ని, కృతజ్ఞతను పొందేలా చేశాయని తెలిపారు.
గత దశాబ్ద కాలంలో ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయటంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. దేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపునకు పైగా పెరిగాయని… అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు కూడా గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఈ అపూర్వమైన వృద్ధి వైద్యరంగంలోకి రావాలనుకునే అభ్యర్థులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని..వైద్య సిబ్బంది వ్యవస్థను బలోపేతం చేస్తుందని, దేశంలోని ప్రతీచోటా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తోందని అన్నారు.
ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనిజువెలాలో సేవలందిస్తున్న భారత వైద్యులు, వైద్య నిపుణుల అంకితభావాన్ని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. సమాజం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు బాధ్యతాయుతంగా వైద్యులు ముందుకు వస్తారని.. క్లిష్ట సమయాల్లో వైద్యులు అందిస్తున్న నిస్వార్థ సేవలు నిరూపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. వైద్యుల కృషి, దయ, అంకితభావం.. భారతదేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థకు కీలక ఆధారం. క్లిష్ట పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజల విశ్వాసాన్నీ, కృతజ్ఞతనీ పొందేలా చేశాయి.
గత దశాబ్ద కాలంలో ఆరోగ్య రంగంలో భారత్ ఎంతో పురోగతిని సాధించింది. దేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపునకు పైగా పెరిగాయి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగింది. ఈ గణనీయమైన వృద్ధి, వైద్యరంగంలోకి రావాలనుకునే అభ్యర్థులకు మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దేశంలోని ప్రతీచోటా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తోంది.
మనం వికసిత్ భారత్ దిశగా కృషి చేస్తున్న తరుణంలో.. ఆరోగ్య సంరక్షణను పెంపొందించటంలో, వైద్య పరిశోధనలను ముందుకు తీసుకెళ్లటంలో, నూతన ఆవిష్కరణలను స్వీకరించటంలో, అందరికీ అందుబాటు ధరలో వైద్య సేవలను అందించటంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారు.
ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం… ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనిజువెలాలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న భారత వైద్యులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇలా క్లిష్టపరిస్ధితుల్లో, అవసరంలో ఉన్న వారికి వైద్యులు సేవల్ని అందిస్తారని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ.
***
On Doctors' Day, greetings to our dedicated doctors, whose hard work, compassion and commitment form the backbone of India's healthcare system. Their tireless efforts, often in the most challenging circumstances, have earned the trust and gratitude of countless people.
— Narendra Modi (@narendramodi) July 1, 2026
Over the…
Today, as we mark Doctors’ Day, I would like to appreciate all the doctors and medical professionals from India who are tirelessly working in Venezuela, as a part of #OperationAmistad. In such a challenging time, their efforts to serve those in need are shining examples of how… https://t.co/IXhEse64ev
— Narendra Modi (@narendramodi) July 1, 2026