Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైబ్రంట్ గుజరాత్ సదస్సు 2019లో పాల్గొనేందుకు మాల్టా ప్రధాన మంత్రి రాక


వైబ్రంట్ గుజరాత్ సదస్సు 2019లో పాల్గొనేందుకు మాల్టా ప్రధానమంత్రి డాక్టర్ జోసెఫ్ మస్కట్ జనవరి 17-19 తేదీల్లో భారత పర్యటనకు వచ్చారు. ఇదే ఆయన తొలి భారత పర్యటన. ఆర్థికశాఖ, పెట్టుబడులు, చిన్నర వ్యాపార వ్యవహారాల మంత్రి డాక్టర్ క్రిస్టియన్ కార్డోనా, ఆయన శాఖకు చెందిన సీనియర్ అధికారులు, వ్యాపావేత్తల భారీ ప్రతినిధివర్గం ఆయనతో ఈ సందర్శనలో ఆయన వెంట ఉన్నారు.మాల్టా ప్రధానమంత్రిని, ఆయన వెంట ఉన్న ప్రతినిధివర్గానికి గుజరాత్ గవర్నర్ ఓపి కోహ్లి స్వాగతం పలికారు.

సదస్సు సందర్భంగా మస్కట్ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి శ్రీ మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో కూడా పాల్గొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఉపరాష్ట్రపతి మాల్టా సందర్శనను ఆయన గుర్తు చేసుకుంటూ ఉభయ దేశాల మధ్య తరచుగా జరుగుతున్న సందర్శనలు, బలం పుంజుకుంటున్న ద్వైపాక్షిక బృందం గురించి ఆయన ప్రస్తావించారు. వాణిజ్య, వ్యాపార బంధం మరింత పెంచుకునేందుకు గల అవకాశాల గురించి కూడా ఇద్దరు ప్రధానమంత్రులు చర్చించారు.
మాల్టాను ఆఫ్రికా, యూరోపియన్ మార్కెట్లకు కేంద్రంగా చేసుకునేందుకు ముందుకు రావాలని ప్రధాన మంత్రి మస్కట్ భారత ఫార్మా, ఐటి రంగ ప్రతినిధులను ఆహ్వానించారు. కృత్రిమ మేథ, బ్లాక్ చెయిన్, ఫైనాన్షియల్ టెక్నాలజీలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో మాల్టాకు సహకరించాలని ఆయన కోరారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని గుర్తిస్తూ మాల్టా లాంఛనంగా ఒక చట్టం చేసిందని తెలియచేస్తూ భారత ఐటి కంపెనీలు దానికి నాయకత్వ పాత్ర పోషించగలవని ఎదురుచూస్తున్నట్టు ఆయన చెప్పారు.

మాల్టా వృత్తి నిపుణులకు గుజరాత్ లోని ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయంలో శిక్షణ నిర్వహించే అవకాశాలపై అన్వేషించడంతో పాటు ఉభయ దేశాల మధ్య విద్యారంగంలో సహకారం విస్తరించాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు. కర్బన వ్యర్థాలు అతి తక్కువగా ఉండి సుస్థిర అభివృద్ధిలో పునరుత్పాదక ఇంధన వనరుల పాత్రను ఉభయ దేశాల ప్రధానమంత్రులు గుర్తిస్తూ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈ దిశగా తీసుకుంటున్న చొరవను ప్రశంసించడంతో పాటు సోలార్ టెక్నాలజీలను మరింతగా పెంచడం, సౌరశక్తి పూర్తి సామర్థ్యాలు వినియోగంలోకి తేవడంతో పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు కట్టుబాటును ప్రకటించారు.

ఈ పర్యటనలో భాగంగా మాల్టా ప్రధానమంత్రి మస్కట్ వైబ్రంట్ గుజరాత్ సదస్సు 2019లో పాల్గొనడంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రితో కూడా సమావేశం అయ్యారు.