Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో భారతదేశానికి, ఫిలిప్పీన్స్ కు మధ్య ఎమ్ ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


వ్యవసాయ రంగంలోనూ మరియు సంబంధిత రంగాలలోనూ భారతదేశానికి, ఫిలిప్పీన్స్ కు మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒయు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ ఒయు వ్యవసాయ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాక, ఈ ఎమ్ఒయు ఉభయ దేశాలకు పరస్పర ప్రయోజనకారిగా ఉంటుంది.

ఇది రెండు దేశాలలోనూ ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై అవగాహనను పెంపొందిస్తుంది. ఉత్తమమైన ఉత్పాదకతకు, మెరుగైన విపణి లభ్యతకు కూడా తోడ్పడుతుంది.

ఈ ఎమ్ఒయు బియ్యం ఉత్పత్తి మరియు ప్రోసెసింగ్, బహుళ పంటల పద్ధతి, మెట్ట ప్రాంత సాగు వ్యవస్థలు, భూ సారం, పట్టు పరిశ్రమ, పశుగణం మెరుగుదల, బయో-ఆర్గానిక్ ఫార్మింగ్, సాలిడ్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్ మెంట్, అగ్రో ఫారెస్టరి ల వంటి రంగాలలో సహకారానికి మార్గాన్ని సుగమం చేస్తుంది

.

ఈ ఎమ్ఒయు సమాన సంఖ్యలో ఉండే ప్రతినిధులతో కూడిన ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని నియమించేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఈ సంయుక్త కార్యాచరణ బృందం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి భారతదేశంలో, అలాగే ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి ఫిలిప్పీన్స్ లో సమావేశం కావలసి ఉంటుంది.

*****