Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో సహకారం కోసం భారత దేశానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


వ్యవసాయం మరియు సంబంధిత రంగాలలో సహకారం కోసం భారత దేశానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ ఎమ్ఒయు ఉభయ దేశాలకు పరస్పర ప్రయోజకరంగా ఉంటుంది. రెండు దేశాలలోను అత్యుత్తమ వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. అంతేగాక, వ్యవసాయ క్షేత్రాల నుండి మెరుగైన దిగుబడులను సాధించడంలోనూ, గ్లోబల్ మార్కెట్ కు చేరడానికి సహాయపడుతుంది. తత్ఫలితంగా మరింత ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి రాగలవు. వ్యవసాయ సంబంధ సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకారం ఉత్పత్తిని పెంచడానికీ, ఆహార భద్రతను పటిష్టపరచుకోవడానికి దారితీసే నూతన మెళకువలను ప్రసాదించగలదు.

***