Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయం మరియు సంబంధ రంగాలలో సహకారం కోసం భారతదేశానికి, పోలండ్ కు మధ్య ఒప్పందంపై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వ్యవసాయం మరియు సంబంధ రంగాలలో సహకారం కోసం భారతదేశానికి, పోలండ్ కు మధ్య ఒప్పందంపై సంతకాలకు ఆమోదం తెలిపింది.

వ్యవసాయంలోని ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని, సస్య సంరక్షణకు సంబంధించిన స్థితిగతులు, హానికారక జీవుల నుండి ఎదురయ్యే బెడదలు, జంతువుల నుండి సంక్రమించే వ్యాధులకు సంబంధించిన సమాచారంతో సహా వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత రంగాల తాలూకు వివిధ కార్యకలాపాలు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. అలాగే వ్యవసాయానికి, అగ్రి- ఫూడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన సంతలు, ప్రదర్శనలు, చర్చాసభలు, సమావేశాలు; సంయుక్త ఆర్థిక కార్యకలాపాలను చేపట్టడం మరియు అభివృద్ధిపరచడం; ఒప్పందానికి సిద్ధమైన పక్షాల (దేశాల) మధ్య అగ్రిఫూడ్ ట్రేడ్ కు మద్దతును తెలపడం వంటివి కూడా ఈ ఒప్పందం పరిధిలో ఉంటాయి.

రెండు దేశాల ప్రతినిధులతోనూ ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జెడబ్ల్యుజి ని) ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఇలా ఏర్పడే జెడబ్ల్యుజి, ద్వైపాక్షిక సహకారానికిగాను ప్రణాళికలను రూపొందిస్తుంది; ఒప్పందం అమలులో తలెత్తే సమస్యలకు పరిష్కారాలను సైతం ఈ బృందం సూచిస్తుంది.

***