Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయదారులకు స్వల్ప కాలిక పంట రుణాలు అందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు ఎన్ ఎ బి ఎ ఆర్ డి (‘నాబార్డ్’) కి వడ్డీలో ప్రభుత్వ సహాయం


వ్యవసాయదారులకు 2016-17 సంవత్సరానికిగాను ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ కు(వడ్డీలో ప్రభుత్వ సహాయం పథకానికి) కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం రూ.18,276 కోట్లు కేటాయించింది. ఈ పథకం రైతులకు రూ.3 లక్షల వరకు స్వల్ప కాలిక పంట రుణాన్ని ఒక సంవత్సరం గడువు లోపల సాలుసరి కేవలం 4 శాతం వడ్డీకే తీర్చివేసే విధంగా తోడ్పడగలదు.

ఈ పథకం ముఖ్య అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి..:

అ). రైతులకు 2016-17 సంవత్సర కాలంలో వారు తీసుకున్న ఒక ఏడాది వరకు గడువు తో కూడిన రూ.3 లక్షల లోపు స్వల్ప కాలిక రుణానికి వడ్డీ లో సాలుకు 5 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ విధానంలో రైతులు వడ్డీ రూపంలో చెల్లించవలసింది 4 శాతం మాత్రమే కాగలదు. ఒకవేళ రైతులు స్వల్ప కాల పంట రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే గనక, వారు పై పథకంలో 5 శాతానికి బదులుగా 2 శాతం ఇంటరెప్ట్ సబ్ వెన్షన్ కు అర్హులు కాగలరు.

ఆ). కేంద్ర ప్రభుత్వం 2016-17 సంవత్సరానికిగాను ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ కోసం ఇంచుమించు రూ.18,276 కోట్లు సమకూర్చుతుంది.

ఇ). ఎవరైతే చిన్న, సన్నకారు రైతులు వారు పండించిన పంటలకు కోతల అనంతర కాలంలో నిల్వ కోసమని 9 శాతం వడ్డీకి రుణం తీసుకోవలసి వస్తుందో, వారికి ఉపశమనం కలిగించేటందుకుగాను కేంద్ర ప్రభుత్వం 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీము కు ఆమోదం తెలిపింది. దీని వల్ల 6 నెలల వరకు గడువున్న రుణాలకు వర్తించగల వడ్డీ రేటు 7 శాతం కాగలదు.

ఈ). స్వల్ప కాలిక పంట రుణాన్ని వ్యవసాయదారులు సకాలంలో చెల్లించకపోతే, వారు పైన ప్రస్తావించిన 7 శాతానికి బదులుగా 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ కు అర్హులు అవుతారు.