Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యాపార ప‌రిష్కార సంబంధ స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశానికి, కొరియా కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


వ్యాపార ప‌రిష్కార సంబంధ స‌హ‌కారం అంశం పై భార‌త‌దేశానికి, కొరియా కు మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం పత్రానికి (ఎంఒయు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

కొరియా అధ్య‌క్షుడు 2018 జులై నెల‌ లో భార‌త‌దేశం లో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన సంద‌ర్భంగా ఈ ఎంఒయు పై సంతకాలు జ‌రిగాయి.

ఉభయ దేశాల యాంటి- డంపింగ్, స‌బ్సిడీ, కౌంట‌ర్ వేలింగ్ మ‌రియు ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు త‌దిత‌ర వ్యాపార సంబంధిత ప‌రిష్కారాల రంగం లో స‌హ‌కారాన్ని ఈ ఎంఒయు ప్రోత్స‌హించ‌నుంది. త‌ద్వారా ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు పెంపొందుతాయి.

**