పిఎంఇండియా
వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ని ఏర్పాటు చేసేందుకు సౌదీ అరేబియా కు మరియు భారతదేశాని కి మధ్య.. 2019వ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీ న ప్రధాన మంత్రి సంతకం చేసిన.. ఒప్పందాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజున సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.
వ్యూహాత్మక భాగస్వామ్యం లో భాగం గా ఉభయ దేశాల లో ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలు/ పథకాల తాలూకు పురోగతి ని పర్యవేక్షించేందుకు ఇరు దేశాల యొక్క అత్యున్నత స్థాయి నాయకత్వం క్రమం తప్పక భేటీ అయ్యేందుకు ఈ ఒప్పందం మార్గాన్ని సుగమం చేస్తుంది. నూతన రంగాల లో వ్యూహాత్మక బంధాన్ని నెలకొల్పుకొనేందుకు మరియు సాధించవలసిన లక్ష్యాల ను, పొందవలసిన ప్రయోజనాల ను నిర్వచించేందుకు కూడా ఈ ఒప్పందం సహాయపడుతుంది.
లాభాలు
ఈ ప్రతిపాదన మహిళలు/పురుషులు అనే భేదాలు గాని, వర్గం రీత్యానో ఆదాయం రీత్యానో భేదాల నిమిత్తం ఏదీ లేకుండా సౌదీ అరేబియా తో ఆర్థిక మరియు వాణిజ్య బంధాల మెరుగుపరచుకొనే లబ్ధి ని పౌరుల కు కల్పించడాని కి ఉద్దేశించినటువంటిది.
సౌదీ అరేబియా తో కుదిరిన ఈ ఒప్పందం రక్షణ, భద్రత, ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా తీసుకొనే చర్య లు, శక్తి సంబంధిత భద్రత, ఇంకా నవీకరణ యోగ్య శక్తి ల వంటి వ్యూహాత్మక రంగాల లో భాగస్వామ్యాని కి గాను నూతన మార్గాల ను తెరుస్తుంది.