Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాంతియుత అవసరాల కోసం అంతరిక్ష అన్వేషణ, ఉపయోగాలలో సహకారం పై భారత, ఉజ్బెకిస్తాన్ మధ్య ఒప్పందాన్ని మంత్రి మండలి ఆమోదించింది


శాంతియుత అవసరాల కోసం అంతరిక్ష అన్వేషణ, ఉపయోగాలలో సహకారం పై భారత, ఉజ్బెకిస్తాన్ మధ్య ఒప్పందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ఆమోదించింది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశంలో అధికార పర్యటన సమయంలో 2018 అక్టోబర్ ఒకటవ తేదీన ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది.

ప్రధాన ప్రభావం :

అంతరిక్షం నుండి భూమి గురించి తెలుసుకోవడం, ఉపగ్రహం ద్వారా సమాచారం అందుకోవడం, ఉపగ్రహం కేంద్రంగా పరిసరాలను గుర్తించడం, అంతరిక్ష శాస్త్రం, ఉప గ్రహాల అన్వేషణ వంటి అంశాలలో నూతన పరిశోధనా కార్యకలాపాలను విశ్లేషించడానికి అనువుగా ప్రేరణ కలిగించడానికి – భారత, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారాన్ని ఈ ఒప్పందం పటిష్ఠపరుస్తుంది.

ప్రయోజనం :

మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష సాంకేతికత వినియోగం రంగంలో సంయుక్త కార్యాచరణను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఈ ఒప్పందాన్ని అమలుచేయడానికి అవసరమైన అంశాలు, నిర్ణీత కాల పరిమితి తో సహా ఒక కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించడానికి గాను, ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

***