పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ కు శాంతియుత ప్రయోజనాలకు అవసరం అయిన అంతరిక్ష పరిజ్ఞానాల అభివృద్ధికి భారత, తజకిస్తాన్ ఒప్పందం వివరాలు తెలియచేశారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో 2018 అక్టోబర్ 8వ తేదీన ఈ రెండు దేశాలు సంతకాలు చేశాయి.
వివరాలు
– భూమిని రిమోట్ సెన్సింగ్ చేయడానికి, ఉపగ్రహ కమ్యూనికేషన్, ఉపగ్రహ నావిగేషన్, అంతరిక్ష/ గ్రహ సంబంధిత అన్వేషణ, ఉపగ్రహ/ఉపగ్రహ వ్యవస్థల వినియోగం, అంతరిక్ష టెక్నాలజీల వినియోగం వంటి ఉభయులకు ఆసక్తి గల విభాగాల్లో సహకారానికి ఈ ఎంఓయు దోహదపడుతుంది.
– డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్, ఇస్రో, భూవనరుల నిర్వహణకు సంబంధించిన కేంద్ర కమిటీ, తజకిస్తాన్ కి చెందిన జియోడెసీ సభ్యులతో ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఒప్పందం సహాయకారిగా నిలుస్తుంది. ఈ ఎంఓయు కాలపరిమితి, అమలుకు సంబంధించిన వివరాలు రూపొందించుకోవడానికి ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ కృషి చేస్తుంది.
ప్రధాన ప్రభావం
భూమికి సంబంధించిన రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ నావిగేషన్, అంతరిక్ష శాస్త్రం, భూవాతావరణానికి వెలుపల అన్వేషణకు కావలసిన అప్లికేషన్ల అభివృద్ధికి, సరికొత్త పరిశోధన కార్యకలాపాలకు ఈ ఎంఓయు కొత్త ఊపునిస్తుంది.
ప్రయోజనాలు
ఉభయ దేశాలు మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలు ఉమ్మడిగా చేపట్టగలుగుతాయి. దీనికి మరింత మద్దతు ఇచ్చేందుకు ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని రెండు దేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఒప్పందం అమలుకు కాలపరిమితిని, అమలుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికను ఈ ఉమ్మడి కార్యాచరణ బృందం తయారుచేస్తుంది.
*****