Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాస్త్రి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌ సందర్శన


తాష్కెంట్‌లోని స్వర్గీయ శాస్త్రి స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పుష్పాంజలి ఘటించారుభారత మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి 1965లో తాష్కెంట్‌లో మరణించి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తవుతున్నాయిస్వర్గీయ శాస్త్రి స్మారకార్థం ఆయన పేరుతో గల ఒక వీధిలో ఈ స్మారక చిహ్నం ఏర్పాటు చేశారుతాష్కెంట్‌లో మాజీ ప్రధానమంత్రి జీవితాన్నివారసత్వాన్ని ఎంతో ఆప్యాయంగా స్మరించుకుంటారుతాష్కెంట్‌లో ఈ స్మారక చిహ్నం గల వీధితో పాటుగా ఆయన పేరు మీద ఒక స్థానిక పాఠశాలభారతీయ సాంస్కృతిక కేంద్రం ఉన్నాయి.

శాస్త్రి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రిఅనంతరం తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌ను సందర్శించారువిశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రధానమంత్రివిశ్వవిద్యాలయ రెక్టార్ ఆత్మీయ స్వాగతం పలికారువిశ్వవిద్యాలయంలోని మహాత్మాగాంధీ కేంద్రంలో భారతీయ విద్యావేత్తలుఅక్కడ చదువుతున్న విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించారుహిందీ భాషఇతర భారతీయ విషయాలను బోధించడంలో ఈ విశ్వవిద్యాలయానికి అద్భుతమైన రికార్డు ఉందితన అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి… హిందీ భాష చదివే ఉజ్బెక్ విద్యార్థుల కోసం లాల్ బహదూర్ శాస్త్రి స్కాలర్‌షిప్‌ను ప్రకటించారుఈ సంవత్సరంతో ఈ విశ్వవిద్యాలయంలో హిందీ బోధనకు 80 ఏళ్లు పూర్తవుతున్నాయిఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సాంస్కృతిక సారూప్యతల దృష్ట్యా… ఉజ్బెక్ విద్యార్థుల్లో హిందీ నేర్చుకోవడం పట్ల గణనీయమైన ఆసక్తి ఉందిఉజ్బెక్హిందీ భాషల్లో సుమారు 3000కు పైగా ఉమ్మడి పదాలు ఉన్నాయి.

 

***