Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాస్త్ర విజ్ఞ‌ానం, సాంకేతిక విజ్ఞ‌ానం మరియు నవకల్పన రంగంలో భారతదేశానికి, ఫ్రాన్స్ కు మధ్య ఎమ్ఒయు ను మంత్రిమండలి దృష్టికి తీసుకువ‌చ్చారు


భారతదేశ ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విజ్ఞ‌ాన విభాగం, టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ (టిడిబి)లకు, ఫ్రాన్స్ కు చెందిన ప్రభుత్వ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంక్ బిపిఐఫ్రాన్స్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)పై సంతకాలయిన సంగతిని మంత్రిమండలి దృష్టికి తీసుకువ‌చ్చారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ఒప్పందం శాస్త్ర విజ్ఞ‌ానం, సాంకేతిక విజ్ఞ‌ానం మరియు నవకల్పన రంగంలో ఫ్రాన్స్ మరియు భారతదేశం కంపెనీల మధ్య, సంస్థల మధ్య సమన్వయం నెలకొల్పడం ద్వారా సాంకేతిక విజ్ఞ‌ాన సంబంధ ఆదాన ప్రదానాలను పెంపొందించడం కోసం సమన్వయపూర్వక చర్యలను చేపట్టడానికి, అలాగే ఉత్తమమైన పద్ధతుల మార్పిడికి వీలు కల్పిస్తుంది.

శాస్త్ర విజ్ఞ‌ానం మరియు సాంకేతిక విజ్ఞ‌ాన రంగాలలో ఉత్తమ పద్ధతుల ఆదాన ప్రదానానికి సంబంధించిన కార్యకలాపాలను టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ (టిడిబి), బిపిఐఫ్రాన్స్ ల ద్వారా చేపట్టాలనేది కూడా ఈ ఒప్పందం ధ్యేయాలలో ఒకటిగా ఉంటుంది.