Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శికాగో లో స్వామి వివేకానంద ప్ర‌సంగించి 125 సంవత్స‌రాలు అయిన సంద‌ర్భంగాను మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించే విద్యార్థుల స‌మ్మేళ‌నంలో ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2017 సెప్టెంబ‌ర్ 11న శికాగో లో స్వామి వివేకానంద ప్ర‌సంగం యొక్క‌125వ వార్షికోత్స‌వం మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ‘యంగ్ ఇండియా, న్యూ ఇండియా’ ఇతివృత్తం పై నిర్వ‌హించే విద్యార్థుల స‌మ్మేళ‌నం లో పాల్గొని ప్ర‌సంగిస్తారు.

ప్ర‌ధాన మంత్రి త‌న ట్విట‌ర్ ఖాతా లో వ‌రుస‌గా ఈ కింది అంశాల‌ను న‌మోదు చేశారు:

‘‘ ‘యంగ్ ఇండియా, న్యూ ఇండియా’ ఇతివృత్తం పై విద్యార్థుల బృందాన్ని ఉద్దేశించి రేపు ప్ర‌సంగించ‌డం కోసం నేను ఎదురు చూస్తున్నాను.

ఈ విద్యార్థుల స‌మ్మేళ‌నం 1893వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 11వ తేదీన.. ఏ రోజయితే స్వామి వివేకానంద శికాగో లో చరిత్రాత్మక ప్ర‌సంగమిచ్చారో.. ఆ సందర్భంగా జ‌రుగనుంది.

ఇదే సంవ‌త్స‌రంలో, స్వామి వివేకానంద శికాగో ప్ర‌సంగం తాలూకు 125వ వార్షికోత్స‌వాన్ని మ‌రియు పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను మనం జ‌రుపుకోబోతున్నాం.

యువ శ‌క్తి యొక్క సామ‌ర్థ్యాన్ని స్వామి వివేకానంద దృఢంగా న‌మ్మారు. జాతి నిర్మాణంలో యువజ‌నుల పాత్ర కీల‌మైంద‌ని ఆయ‌న భావించారు.

స్వామి వివేకానంద ఆద‌ర్శాల ద్వారా మేము ప్రేర‌ణ‌ను పొంది, మ‌న యువ‌త ఆకాంక్ష‌ల‌ను మ‌రియు స్వ‌ప్నాల‌ను నెర‌వేర్చే దిశ‌గా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’.