Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీలంక సెంట్రల్ బ్యాంకు వినియోగించుకున్న 1.1 బిలియన్ అమెరికన్ డాలర్ల కరెన్సీ మార్పిడి సదుపాయం చెల్లుబాటు తేదీ పొడిగింపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం


భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి శ్రీలంక సెంట్రల్ బ్యాంకు వినియోగించుకున్న 1.1 బిలియన్ అమెరికన్ డాలర్ల కరెన్సీ మార్పిడి సదుపాయం చెల్లుబాటు తేదీని 2016, మార్చి నెల 8 వ తేదీ వరకు పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. (దీన్ని మార్చి 3, 2016 కు తిరిగి చెల్లించాల్సి ఉంది).

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు శ్రీలంకకు తాత్కాలిక ఊరట లభించింది. అలాగే ఆ దేశం ఆర్థిక స్థిరత్వాన్ని దృఢపరచుకునేందుకు కూడా ఉపకరిస్తుంది.

శ్రీలంక కు మూడు నెలల పాటు లేదా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ని ఉపయోగించుకునే వరకు(ఏది ముందు అయితే అది) 700 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రత్యేక మార్పిడి అందజేసేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

అమెరికా వడ్డీ రేట్ల ను పెంచడంతో 2015 నుంచి శ్రీలంక ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా ఇరుదేశాల దౌత్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. సార్క్ లో, దక్షిణాసియాలో భారత్ కు శ్రీలంక ముఖ్యమైన భాగస్వామ్య దేశంగా ఉంది.