పిఎంఇండియా
శ్రీ అజయ్ రాయ్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అజయ్ రాయ్ అనారోగ్యంతో ఉన్నారన్న వార్త తనకు అందిందని, ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ గారు అనారోగ్యంతో ఉన్నారన్న విషయం తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’.
उत्तर प्रदेश कांग्रेस अध्यक्ष अजय राय जी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ है। मैं उनके जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।@kashikirai
— Narendra Modi (@narendramodi) May 1, 2026