Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ చో రామస్వామి మరణం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ చో రామస్వామి మరణం పట్ల సంతాపం తెలిపారు.

“చో రామస్వామిది బహుళ పార్శ్వాలు కలిగిన వ్యక్తిత్వం, శిఖర సమానమైన మేధో సంపత్తి మూర్తీభవించిన వారు. ఆయన గొప్ప జాతీయతావాదే కాకుండా నిర్భయంగా గళమెత్తే మాన్యులు, ప్రశంసలకు నోచుకొన్న వారు కూడా.

అన్నింటికీ మించి, చో రామస్వామి ప్రియ మిత్రుడుగా మెలగారు. ఆయన వార్షిక పాఠక జన సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ సమావేశాలు అపూర్వమైన రీతిలో సంపాదకుడు, పఠితల మధ్య సమన్వయాన్ని కలిగించేవి.

చో రామస్వామి అంతర్ దృష్టిని, సూక్ష్మ బుద్దిని కలిగిన వారు, నిర్మొగమాటస్తుడు. ఆయన మరణం దు:ఖం కలిగిస్తోంది. ఆయన కుటుంబానికి, అసంఖ్యాకంగా ఉన్న తుగ్లక్ పాఠకలోకానికి సంతాపం తెలియజేస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.