Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ నరేశ్ చంద్ర మృతి పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


పూర్వ ప్రభుత్వోద్యోగి శ్రీ నరేశ్ చంద్ర మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

‘‘శ్రీ నరేశ్ చంద్ర శ్రేష్ఠుడైన ప్రభుత్వోద్యోగి. పరిపాలన మరియు విధానపరమైన అంశాలలో చెరగని ముద్ర వేశారాయన. ఆయన కన్నుమూత నాకు వేదన కలిగించింది.

యుఎస్ఎ రాయబారిగా పనిచేసిన నరేశ్ గారు నన్ను రాత్రి పూట భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో జరిపిన కూలంకష చర్చ నాకింకా గుర్తుంది. ఆయన భారతదేశం-యుఎస్ఎ మధ్య పటిష్టమైన స్నేహబంధం ఉండాలని నమ్మారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.