Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ పెజావర పీఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ శివైక్యం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉడుపి లోని శ్రీ పెజావర మఠాని కి చెందిన శ్రీ విశ్వేశ తీర్థ స్వామిజీ శివైక్యం చెందినందుకు సంతాపం వ్యక్తం తెలిపారు.

‘‘ఉడుపి లోని శ్రీ పెజావర మఠాని కి చెందిన శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయి గా నిలిచిపోతారు. మార్గదర్శకుడి గా విశ్వేశ తీర్థ స్వామి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. సేవ, ఆధ్యాత్మికత కు స్వామీజీ ఓ పవర్ హౌస్ లాంటి వారు. న్యాయమైన, దయగల సమాజ నిర్మాణానికై స్వామీజీ నిరంతరం పని చేశారు. ఓం శాంతి.

శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ నుండి నేర్చుకోవడానికి అనేక అవకాశాలు లభించడం నా అదృష్టం గా భావిస్తాను. ఇటీవల గురుపౌర్ణమి సందర్భం గా స్వామీజీ ని కలవడం ఎప్పటి కీ గుర్తుండిపోతుంది. స్వామీజీ అందించిన విజ్ఞానం ఎప్పటికీ నిలచిపోతుంది. భక్తజనాని కి నా ప్రగాఢ సంతాపం. నా ఆలోచనలు స్వామీజీ అనుచరుల తో ఉన్నాయి” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.