Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ మనోహర్ పర్రికర్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


గోవా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పర్రికర్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

“శ్రీ మనోహర్ పర్రికర్ ఒక సాటి లేని నాయ‌కుడు. ఒక సిసలైన దేశ‌ భ‌క్తుడు మ‌రియు అసాధార‌ణ‌మైన‌టు వంటి ప‌రిపాల‌కుడు అయిన ఆయన ను అంద‌రూ అభిమానించే వారు. దేశ ప్ర‌జ‌ల కు ఆయ‌న చేసిన నిష్కళంక సేవ ను త‌రాల‌ త‌ర‌బ‌డి స్మ‌రించుకొంటారు. ఆయ‌న మృతి ప్ర‌గాఢ‌ దుఃఖాన్ని క‌లిగించేటటువంటిది. ఆయ‌న కుటుంబాని కి మ‌రియు మ‌ద్ధ‌తుదారుల‌ కు ఇదే నా సంతాపం. ఓం శాంతి.

ఆధునిక గోవా యొక్క శిల్పి శ్రీ మనోహర్ పర్రికర్. ఆయ‌న స్నేహ‌ పూర్వ‌క‌ వ్య‌క్తిత్వం మ‌రియు అంద‌రికీ అందుబాటు లో ఉండే స్వ‌భావాల కార‌ణం గా ఆయ‌న కొన్ని సంవ‌త్స‌రాల పాటు రాష్ట్రాని కి అభిమాన పాత్రుడైన నాయ‌కుడు గా ఉండిపోయారు. ఆయ‌న అనుస‌రించిన ప్ర‌జానుకూల విధానాలు గోవా విశిష్ట పురోగతి శిఖ‌రాల ను అందుకొనేట‌ట్లు చేశాయి.

శ్రీ మనోహర్ పర్రికర్ మ‌న ర‌క్ష‌ణ మంత్రి గా ప‌ని చేసినందుకు భార‌త‌దేశం ఆయ‌న కు ఎల్లప్పటికీ రుణ‌ప‌డిపోతుంది. ఆయ‌న హ‌యాం లో, భార‌త‌దేశ భద్ర‌త సామ‌ర్ధ్యం పెరిగేట‌టువంటి, ర‌క్ష‌ణ రంగం లో దేశీయ ఉత్ప‌త్తి కి ఉత్తేజం ల‌భించేట‌టువంటి మ‌రియు మాజీ సైనికోద్యోగుల జీవితాలు మెరుగు ప‌డేట‌టువంటి ప‌లు నిర్ణ‌యాల‌ ను దేశ ప్రజలు వీక్షించారు’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.