Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ రామ్ జెఠ్ మలానీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


పూర్వ కేంద్ర మంత్రి మ‌రియు న్యాయ‌ కోవిదుడు శ్రీ రామ్ జెఠ్ మలానీ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

“శ్రీ రామ్ జెఠ్ మలానీ గారి మ‌ర‌ణం తో భార‌త‌దేశం ఒక అసాధార‌ణ‌మైన న్యాయ‌వాది ని, న్యాయ‌స్థానం లోనూ, పార్ల‌మెంటు లోనూ విశిష్ట‌మైన తోడ్పాటుల ను అందించినటువంటి ప్ర‌జా ప్ర‌ముఖుడి ని కోల్పోయింది. ఆయ‌న హాస్య చ‌తుర‌త కు, సాహసాని కి మారు పేరు. ఏ అంశం పైన అయినా సరే, తన యొక్క అభిప్రాయాల ను భయపడకుండా వెలిబుచ్చడం లో ఎన్న‌డూ వెనుకంజ వేయ‌నటువంటి వ్యక్తి గా నడుచుకొన్నారు.

శ్రీ రామ్ జెఠ్ మలానీ గారి లోని సర్వశ్రేష్ఠ పార్శ్వాల లో ఒక‌టి ఏమిటంటే ఆయ‌న త‌న ఆలోచనలను బయటపెట్టేటటువంటి త‌త్వం. మ‌రి ఆయ‌న ఆ ప‌ని ని ఎటువంటి భీతికి తావు ఇవ్వ‌కుండా చేసే వారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి తాలూకు అంధ‌కార భ‌రిత‌మైనటువంటి కాలం లో ఆయన ప్ర‌ద‌ర్శించిన ధీరోదాత్తత ను మ‌రియు ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం ఆయన కనబరచిన సంఘర్షణ ను స‌దా జ్ఞాప‌కం పెట్టుకోవడం జరుగుతుంది. ఆప‌న్నుల‌ కు స‌హాయాన్ని అందించడం ఆయ‌న యొక్క వ్య‌క్తిత్వం లో ఒక అంతర్భాగం గా ఉండిపోయింది.

శ్రీ రామ్ జెఠ్ మలానీ గారి తో ముఖాముఖి సంభాషించే అవకాశాలను అసంఖ్యాక‌ంగా ద‌క్కించుకొన్నందుకు న‌న్ను నేను భాగ్య‌శాలి గా భావించుకొంటాను. ఈ దుఃఖ ఘ‌డియ‌ల లో ఆయ‌న కుటుంబాని కి, మిత్రుల కు మ‌రియు ఆయన యొక్క ఎంద‌రో అభిమానుల కు ఇదే నా సంతాపం. ఆయ‌న నేడు మ‌న మ‌ధ్య లేరు గాని ఆయ‌న చూపిన‌టువంటి మార్గ‌దర్శ‌క‌ కృషి ఎప్ప‌టి కీ స‌జీవం గానే ఉంటుంది. ఓం శాంతి” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

**