Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంఘ సేవకురాలు పూర్ణిమాబెన్ పక్వాస మరణం పట్ల దు:ఖం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


సంఘ సేవకురాలు శ్రీమతి పూర్ణిమాబెన్ పక్వాస మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖం వ్యక్తం చేశారు.

“పూర్ణిమాబెన్ పక్వాస మరణం గురించి విన్నాను. ఈ వార్త నాకెంతో దు:ఖం కలిగించింది. ఆమె అసాధారణ వ్యక్తిత్వం కలిగిన వారు. ఆదివాసీ బాలికలకు చదువు చెప్పడంలో అసామాన్య కృషి చేశారు.

పూర్ణిమాబెన్ చిరకాలం జీవించారు.. 103 ఏళ్ల వయస్సులో మనను వీడి వెళ్లారు. నేను సపుతారా ను సందర్శించినపుడల్లా ఆమెతో జరిపిన సంభాషణ లు నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కీర్తిశేషురాలయిన పూర్ణిమాబెన్ కుమార్తె సోనాల్ మాన్ సింగ్ తో మాట్లాడి, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.