ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సూక్తిని ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘సతాం ప్రసంగాన్మమ వీర్యసంవిదో
భవన్తి హృత్కర్ణరసాయనాః కథాః
తజ్జోషణాదాశ్వపవర్గవత్మర్మని
శ్రద్ధా రతిర్బక్తిరనుక్రమిష్యతి’’ అని పేర్కొన్నారు.
పైన ప్రస్తావించిన సుభాషితానికి..సజ్జనుల సాహచర్యం మనిషి హృదయాన్ని, మస్తిష్కాన్ని ఉల్లాసపరిచే స్ఫూర్తిదాయక చర్చలకు దోవ తీస్తుంది. ఆ జ్ఞాన వర్ధక చర్చలు మానవుల్లో క్రమంగా శ్రద్ధను, అనురాగాన్ని, సిసలైన భక్తిని నింపి పరమ పదం వైపు నడిపిస్తాయి అని అర్థం.
सतां प्रसङ्गान्मम वीर्यसंविदो भवन्ति हृत्कर्णरसायना: कथा: । तज्जोषणादाश्वपवर्गवर्त्मनि श्रद्धा रतिर्भक्तिरनुक्रमिष्यति॥ https://t.co/2o39QQS5O6
— Narendra Modi (@narendramodi) November 27, 2026