పిఎంఇండియా
సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) రంగంలో భారతదేశం, దక్షిణ ఆఫ్రికా ల మధ్య 2016 జూలై 8న సంతకాలు జరిగిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎం ఒ యు) ను మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఐ సి టి రంగంలో సహకారాన్ని పెంపొందించేటందుకు అనువుగా ఇరు పక్షాలకు చెందిన సంస్థల మధ్య సహకారాన్ని ఏర్పరచడంతో పాటు, ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టం కావడానికి కూడా ఈ ఎం ఒ యు దోహదం చేయనున్నది.
అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఐ సి టి రంగంలో ప్రైవేటు సంస్థలు, సామర్థ్యం పెంపుదల సంస్థలు, ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య క్రియాశీల సహకారానికి సైతం ఈ ఎం ఒ యు బాట పరచగలుగుతుంది.