Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు డిజిటల్ ఎకానమి రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారతదేశం, ట్యూనీసియా ల మధ్య ఎమ్ ఒ యు


సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) మరియు డిజిటల్ ఎకానమి రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారతదేశానికి, ట్యూనీసియా కు మధ్య 2016 జూన్ 2వ తేదీన అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు జరిగిన సంగతిని కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకువ‌చ్చారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) మరియు డిజిటల్ ఎకానమి రంగంలో సామర్థ్యాల పెంపుదలలో పాలు పంచుకొంటున్న రెండు దేశాలకు చెందిన ప్రభుత్వాలు, సంస్థలు, ప్రయివేట్ ఎన్ టిటి లు, ఇతర పబ్లిక్ ఆర్గనైజేషన్ లు మరియు ప్రయివేట్ ఆర్గనైజేషన్ లకు మధ్య క్రియాశీల సహకారాన్ని, ఆదాన ప్రదానాలను ప్రోత్సహించడం ఈ ఎమ్ ఒ యు ఉద్దేశం.