పిఎంఇండియా
సమాచార సాంకేతిక విజ్ఞానం మరియు ఎలక్ట్రానిక్స్ (ఐటి & ఇ) రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికిగాను భారతదేశం, బాంగ్లాదేశ్ ల మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై ఇప్పటికే సంతకాలయిన సంగతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ, బాంగ్లాదేశ్ కు చెందిన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డివిజన్ కు మధ్య ఈ ఎమ్ఒయు పైన 2017 ఏప్రిల్ లో సంతకాలు జరిగాయి. ఇది అయిదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత, దీనిని ఇది అమలులో ఉన్న కాలంలో ఎప్పుడైనా సరే, ఇరు పక్షాల పరస్పర లిఖితపూర్వక సమ్మతితో దీనిని పొడిగించే అవకాశం ఉంది. ఒక పక్షం మరొక పక్షానికి ఆరు నెలల ముందస్తు లిఖితపూర్వక నోటీసును ఇచ్చి ఈ ఎమ్ఒయు ను రద్దు చేయవచ్చు.
ఐటి ఇ రంగంలో కుదిరిన ఈ ఎమ్ఒయు స్వభావరీత్యా సాంకేతికమైనటువంటిది. ఇది ప్రధానంగా ఇ-గవర్నెన్స్, ఎమ్-గవర్నెన్స్, ఇ- పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్ వంటి వాటిపైన శ్రద్ధ వహిస్తుంది. భారతీయ ఐటి కంపెనీలు బాంగ్లాదేశ్ లో వ్యాపార అవకాశాలను, ఐటి & ఇ మార్కెట్ ను అన్వేషించడంపైన మరియు భారతీయ ఎలక్ట్రానిక్స్, ఇంకా ఐటీ రంగాలలోకి పెట్టుబడులను ఆకర్షించడంపైన ఈ ఎమ్ఒయు దృష్టిపెడుతుంది. ఫలితంగా, ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా అందిరాగలవు.