Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సమాజ సంక్షేమానికి అంకితమైన వివేకి గుణగణాలను వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


సమాజ సంక్షేమానికి అంకితమైన వివేకి గుణగణాల్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
‘అందరితో కలసి, అందరి పురోగతి కోసం’ (సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్) భావనతో స్ఫూర్తిని పొంది, గత 12 సంవత్సరాలుగా నిరంతర ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం శక్తిమంతమైన, స్వయంసమృద్ధ భారత్‌ను ఆవిష్కరించే దిశగా మనం ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని  ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘దేశ నిర్మాణానికి అంకిత భావాన్ని, సేవాభావాన్ని కనబరచడమే మనకొక అమూల్యమైన పెన్నిధి. గడచిన 12 సంవత్సరాల్లో ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ భావనతో ప్రేరణను పొంది, నిరంతర ప్రయత్నాలను చేస్తున్నందువల్లనే మనం ప్రస్తుతం ఒక శక్తిమంతమైన, ఆత్మనిర్భర్ భారత్‌ను ఆవిష్కరించే దిశగా పురోగమిస్తున్నాం.
ఆర్యకర్మణి రజ్యన్తే భూతికర్మాణి కుర్వతే
హితం చ నాభ్యసూయన్తి స వై పండిత ఉచ్యతే’’
ఒక వ్యక్తి నిత్యం పవిత్రమైన, సత్కార్యాల్లో నిమగ్నమవుతూ, సమాజ పురోగతితో పాటు సమాజ సంక్షేమం పట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తూ, ఇతరుల హిత వచనాల్ని, వారి పనులను గౌరవిస్తుంటారో, అలాంటి వారి పట్ల ఏ చెడు భావనను మనసులో పెంచుకోరో… అలాంటి వ్యక్తే సిసలైన వివేకి అని అనిపించుకుంటారు’’ అని పేర్కొన్నారు.

***