Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒక నవోదయాని కి నాంది: ప్రధాన మంత్రి


అయోధ్య పై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ను చరిత్రాత్మకమైందంటూ ప్రధాన మంత్రి అభినందించారు. ఈ రోజు భారతదేశ న్యాయ వ్యవస్థ లో మరియు భారతదేశ చరిత్ర లో ఒక సువర్ణ దినం గా నిలచిపోతుంది అని ఆయన అన్నారు. ఒక న్యూ ఇండియా ను నిర్మించడాని కి, అలాగే ప్రతి ఒక్కరి అభివృద్ధి కి పాటు పడటాని కి కలసి రావలసింది గా పౌరులందరి కి ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ రోజు న, నవంబర్ 9వ తేదీ నాడు, కర్ తార్ పుర్ కారిడర్ ఆరంభం అయింది. ఈ కారిడర్ కై భారతదేశం తో పాటు పాకిస్తాన్ వైపు నుండి ప్రయత్నాలు జరిగాయి. ఇక ఇప్పుడు, ఒక్కటి గా ఉండాలనే శక్తి ని మరియు కలసి వర్ధిల్లాలనే శక్తి ని అయోధ్య పై వెలువడిన ఇవాళ్టి నిర్ణయం, ఈ రోజు- అంటే నవంబర్ 9వ తేదీ- మనకు బోధిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సర్వోన్నత న్యాయస్థానం ప్రతి ఒక్కరి మాటల ను ఎంతో ఓపిక తో ఆలకించి మరీ ఏకీభావంతో కూడినటువంటి నిర్ణయాన్ని ఇచ్చింది. ఈ తీర్పు మహత్తర సంకల్పాన్ని చాటింది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి ఇంకా ఇలా అన్నారు.. ‘‘ ఈ రోజు వెలువరించినన తీర్పు తో, సర్వోన్నత న్యాయస్థానం ఒక సందేశాన్ని ఇచ్చింది. అది ఏమిటి అంటే, కఠినాతి కఠినమైనటువంటి సమస్యల ను సైతం రాజ్యాంగ చట్రాని కి లోబడి, చట్టాల స్ఫూర్తి తో పరిష్కరించవచ్చనేదే’’

ఎంతో కొంత జాప్యం జరిగినప్పటి కి, మనం ఓరిమి వహించాలి అనేదే. ఇది ప్రతి ఒక్కరి కి మేలు చేస్తుంది అనే విషయాల ను మనం ఈ తీర్పు తో నేర్చుకోవాలి.

ప్రతి ఒక్క పరిస్థితి లో కూడాను భారతదేశ రాజ్యాంగం పట్ల, భారతదేశ న్యాయ వ్యవస్థ పట్ల మనకు గల నమ్మకం ఊగిసలాడనిది గా ఉండి తీరాలి. ఇది చాలా ముఖ్యం. ’’

సర్వోన్నత న్యాయస్థానం రామ మందిరం పట్ల తన నిర్ణయాన్ని వెల్లడించింది. మరి ఈ నిర్ణయం మన పౌరులందరి మీద దేశ నిర్మాణం అనేటటువంటి మన బాధ్యత ను మరింత గంభీరం గా వహించాలని కూడా స్పష్టీకరించింది అని ప్రధాన మంత్రి అన్నారు. మన మధ్య గల ఏకత, శాంతి, స్నేహం, సోదరీ సోదర భావం మరియు సద్భావన అనేవి దేశ అభివృద్ధి కి ఎంతో ముఖ్యం అని ప్రధాన మంత్రి చెప్పారు. కలసికట్టుగా కదులుతూ, మన ఉద్దేశ్యాలను మరియు మన లక్ష్యాల ను సాధించడం కోసం పనిచేయాలి అని పౌరులందరి కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.