పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సాంకేతికతపై రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. భారతదేశంలో సాంకేతికత సమానత్వాన్ని తెస్తోందనీ, వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ అధికారుల వరకూ అందరినీ సాధికారులను చేస్తోందనీ కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇండియా స్టాక్, యూపీఐ, జేఏఎం త్రయం, కోవిన్ వంటి వినూత్న కార్యక్రమాలూ, వీటితోపాటు ఆవిష్కరణలూ, సమ్మిళిత్వం వంటి అంశాలూ ప్రజల జీవితాల్ని మార్చివేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధాని శ్రీ మోదీ ఇలా స్పందించారు:
‘‘భారతదేశంలో సాంకేతికత సమానత్వాన్ని తెస్తోందనీ, వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ అధికారుల వరకూ అందరినీ సాధికారులను చేస్తోందనీ కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఇండియా స్టాక్, యూపీఐ, జేఏఎం త్రయం, కోవిన్ వంటి వినూత్న కార్యక్రమాలూ, వీటితోపాటు ఆవిష్కరణలూ, సమ్మిళిత్వం వంటి అంశాలూ ప్రజల జీవితాల్ని మార్చివేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ పాలనను మెరుగుపరచడంతోపాటు ప్రపంచ స్థాయిలో భారతదేశం పాత్రను మరింత బలోపేతం చేశాయి’’
***
Union Minister Shri @AshwiniVaishnaw writes that technology has become India's greatest equaliser, empowering everyone from street vendors to corporate executives. Through initiatives such as India Stack, UPI, JAM trinity and CoWIN, innovation and inclusion have transformed… pic.twitter.com/sgxesZugI4
— PMO India (@PMOIndia) September 19, 2025