పిఎంఇండియా
నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రాజీవ్ గౌబా రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు. భారత్ వంటి విశాల దేశంలో కార్యక్రమాలను అమలు చేయడంలో సాంకేతికతకు, విశ్వాసానికి, పౌరుల భాగస్వామ్యానికి
ప్రధానమంత్రి ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యాన్ని ఇస్తోందని శ్రీ రాజీవ్ గౌబా వివరించారు.
డిజిటల్ వ్యవస్థలు, ప్రయోజనాలను నేరుగా బదిలీ చేసే పద్ధతులు, సరళతర నియంత్రణలు, కొనుగోళ్లలో పారదర్శక ప్రక్రియ.. ఇవి సామర్థ్యాన్ని, లభ్యతను ఎంతగా మెరుగుపరుస్తూ, భారత్ వృద్ధి గాథలో పరిపాలనను ఓ ఆర్థిక అనుకూలతగా మార్చివేశాయో శ్రీ గౌబా తన వ్యాసంలో తెలియజేశారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రాజీవ్ గౌబా ఒక వ్యాసం రాశారు.. అందులో భారత్ వంటి విశాల దేశంలో కార్యక్రమాలను అమలుపరచడంలో సాంకేతిక విజ్ఞానం, విశ్వాసం, పౌరుల భాగస్వామ్యాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పాత్రను ఇస్తోందని వివరించారు.
డిజిటల్ వ్యవస్థలు, ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా బదలాయించే విధానాలు, సరళతర నియంత్రణలు, కొనుగోళ్లలో పారదర్శకత.. ఇవి సామర్థ్యాన్ని, లభ్యతను మెరుగుపరుస్తూ, పరిపాలనను భారత్ అభివృద్ధి గాథలో ఓ ఆర్థిక అనుకూలతగా మార్చాయని వ్యాస కర్త పేర్కొన్నారు’’ అని తెలిపింది.
***
Shri Rajiv Gauba, Member, NITI Aayog, writes that PM @narendramodi's governance model is making technology, trust and citizen engagement central to delivering programmes at India's scale.
— PMO India (@PMOIndia) September 17, 2026
He highlights how digital systems, direct transfers, simpler regulations and transparent… pic.twitter.com/fV0P6Pxc1k