పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, సామాజిక భద్రతకు సంబంధించి ఇండియా, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య ఒప్పందంపై సంతకానికి తన ఆమోదం తెలిపింది.
నేపథ్యం:
స్వల్ప కాలంపాటు విదేశాల లో పని చేసే నైపుణ్యం గల పనివారు, భారతీయ ప్రొఫెశనళ్ల ప్రయోజనాల ను పరిరక్షించేందుకు, భారతీయ కంపెనీల పోటీతత్వాన్ని మరింత పెంచేందుకు భారతదేశం ఇతర దేశాల తో ద్వైపాక్షిక సామాజిక భద్రతా ఒప్పందాలు (ఎస్.ఎస్.ఎ)లు కుదుర్చుకుంటున్నది.
ఎస్.ఎస్.ఎ ల వల్ల స్థూలంగా ఈ కింది మూడు ప్రయోజనాలు ఉంటాయి:
i. వర్కర్లు ద్వంద్వ సామాజిక భద్రతా చెల్లింపులు చేయనవసరం లేకుండా చేస్తుంది(డిటాచ్‌మెంట్)
ii. ప్రయోజనాలు (ఎక్స్‌పోర్టబిలిటీ) రెమిటెన్స్‌లు సులభతరం
iii. ప్రయోజనాలకు సంబంధించిన నష్టాలను తొలగించడానికి( టోటలైజేశన్) కంట్రిబ్యూషన్‌కాలాన్ని(ఉభయ దేశాలలో)అగ్రిగేట్ చేయడం. ఈ ఒప్పందం విదేశాలలో పనిచేసే భారతజాతీయులకు అంగవైకల్యానికి సంబంధించి బీమా ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఇప్పటివరకు ఇండియా 18 దేశాలతో ఎస్.ఎస్.ఎ ల పై సంతకాలు చేసింది.
బ్రిక్స్ దేశాలతో సామాజాక భద్రతా కార్యక్రమాలపై ఒప్పందాల విషయంలో సంతకాలు చేయాలన్న అంశంపై జెనీవాలో 2016 జూన్ 9 న జరిగిన బ్రిక్స్ కార్మిక, ఉపాధి శాఖమంత్రుల సమావేశంలో , 2016 సెప్టెంబర్ 27-28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చించారు. బ్రిక్స్ దేశౄలతో సామాజిక భద్రతా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం గురించిన ప్రస్తావన 8వ బ్రిక్స్‌నాయకత్వ శిఖరాగ్ర సమ్మేళనం గోవా డిక్లరేషన్‌లోనూ కనిపిస్తుంది. గోవా డిక్లరేషన్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇండియా, బ్రెజిల్ దేశాలు 2017 మార్చి 13-16 మధ్య బ్రెసీలియాలో ఎస్.ఎస్.ఎ లపై సంప్రదింపులు జరిపాయి.
సంతకాలు జరిగిన ఒప్పందం సమాచారం సంబంధిత పక్షాల కోసం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో , ఎంప్లాయీస్ ప్రావిడెంట్‌ఫండ్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్ లో పొందుపరచనున్నారు. దీనివల్ల వారు సర్టిఫికేట్ ఆఫ్ కవరేజ్ పొందడానికి , తద్వారా ద్వంద్వ సామాజిక భద్రతా కంట్రిబ్యూషన్లు చేయకుండా ఉండడానికి వీలు కలుగుతుంది.
ప్రస్తుతం ఇండియాలో 1000 మంది బ్రెజిలియన్లు నివశిస్తున్నారు. 4700 మంది భారతీయుల బ్రెజిల్ లో నివశిస్తున్నారు. ఈ ప్రతిపాదన వల్ల ఎలాంటి వివక్షకు తావు లేకుండా నియమింపబడిన,డిటాచ్ అయిన వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఆ రకంగా ఇది సమానత్వాన్ని, సమ్మిళితత్వాన్ని పెంపొందిస్తుంది. బ్రెజిల్ నుంచి భారతీయ వర్కర్లు రీలోకేట్ అయిన తర్వాత వారి సామాజిక భద్రతా ప్రయోజనాల బదిలీ అనేది సరికొత్త విధానం. దీనివల్ల సామాజిక భద్రతా ప్రయోజనాలు నష్టపోకుండా ఉండడానికి వీలు కలుగుతుంది. అలాగే ఇది భారతీయ కంపెనీల మొత్తం ఖర్చు తగ్గి పోటీసామర్థ్యం పెరగడానికి వీలుకలుగుతుంది.
ఎస్.ఎస్.ఎ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ఫెపడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల భూభాగాలకు వర్తిస్తుంది.