Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింద్రీ ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; ఝార్ ఖండ్ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు

సింద్రీ ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; ఝార్ ఖండ్ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు

సింద్రీ ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; ఝార్ ఖండ్ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు

సింద్రీ ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; ఝార్ ఖండ్ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సింద్రీ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మం లో భార‌త ప్ర‌భుత్వం మరియు ఝార్ ఖండ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ ప‌థ‌కాల‌లో:

• హిందుస్తాన్ వూర్వార‌క్ అండ్ ర‌సాయ‌న్ లిమిటెడ్ కు చెందిన సింద్రీ ఎరువుల క‌ర్మాగారం పున‌రుద్ధ‌ర‌ణ‌;

• గేల్ కు చెందిన రాంచీ సిటీ గ్యాస్ పంపిణీ ప‌థకం;

• దేవ్‌ఘ‌ర్ లో అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్‌);

• దేవ్‌ఘ‌ర్ విమానాశ్ర‌య అభివృద్ధి ప‌థ‌కం;

• ప‌త్ రాతూ సూప‌ర్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రోజెక్టు లు ఉన్నాయి.

జ‌న్ ఔష‌ధి కేంద్రాల కు సంబంధించిన ఎమ్ఒయు ల ఆదాన ప్ర‌దానాన్ని కూడా ఆయ‌న వీక్షించారు.

స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, భ‌గ‌వాన్ బిర్ సా ముండా కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఝార్ ఖండ్ త్వ‌రిత‌ గ‌తిన అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రియు కేంద్ర ప్ర‌భుత్వం క‌లిసి కృషి చేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

ఈ రోజున పునాది రాళ్ళు వేసిన ప‌థ‌కాల మొత్తం వ్య‌యం 27,000 కోట్ల రూపాయ‌లు అని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ అభివృద్ధి ప‌థ‌కాలు ఝార్ ఖండ్ లో యువ‌తీ యువ‌కుల‌కు అవ‌కాశాలను ప్ర‌సాదిస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

తాను ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన‌ప్పుడు విద్యుత్ సౌక‌ర్యానికి నోచుకోని గ్రామాలు 18,000 వరకు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ ప‌ల్లెల‌ ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగుల‌ను నింపేందుకు మేము కృషి చేసి, ఆయా గ్రామాల‌కు విద్యుత్తు ను స‌మ‌కూర్చామ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌స్తుతం మేము మ‌రొక్క అడుగు ముందుకు వేసి, భార‌త‌దేశం లో ప్ర‌తి కుటుంబానికి విద్యుత్తు సౌక‌ర్యం అందుబాటులో ఉండే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకొంటున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప‌ని చేయ‌డం నిల‌చిపోయిన‌టువంటి ఎరువుల క‌ర్మాగారాల‌ను పున‌రుద్ధ‌రించే ప్ర‌క్రియ సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌క్రియ నుండి భార‌త‌దేశం లోని తూర్పు ప్రాంతాలు అత్యంత ప్ర‌యోజ‌నాన్ని పొందుతాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఝార్ ఖండ్ లో ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటు చేయ‌నుండడంతో రాష్ట్రం లోని ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం మార్పు చెంద‌గ‌ల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. పేద ప్ర‌జ‌లు ఉన్న‌త నాణ్య‌త క‌లిగిన ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను పొంద‌గ‌లుగుతార‌ని ఆయ‌న వివ‌రించారు.

విమాన యానాన్ని కేంద్ర ప్ర‌భుత్వం త‌క్కువ వ్య‌యంతోను మరియు పలువురికి అందుబాటు లోకి తీసుకు వ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

***