Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఎస్ఐఆర్ 75వ స్థాపక దినం సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ వేడుకను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

సిఎస్ఐఆర్ 75వ స్థాపక దినం సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ వేడుకను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

సిఎస్ఐఆర్ 75వ స్థాపక దినం సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ వేడుకను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సిఎస్ఐఆర్ 75వ స్థాపక దినం సందర్భంగా ప్లాటినమ్ జూబిలీ వేడుకను ప్రారంభించారు.

సిఎస్ఐఆర్ యొక్క అనేక కార్యక్రమాలను గురించి వివరించే ఒక ప్రదర్శనను ప్ర‌ధాన మంత్రి సందర్శించారు. కొన్ని ఔషధీయ, సుగంధభరిత మొక్కల రకాలను కూడా ఆయన దేశానికి అంకితమిచ్చారు; దేశంలోని అయిదు వేరువేరు ప్రాంతాలు.. హైదరాబాద్, కడలూర్, జమ్ము, జోర్ హాట్, పాలంపూర్ ల వ్యవసాయదారులతో సంభాషించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ప్రజాస్వామిక వస్త్రానికి ముద్ర అయిన చెరపరాని సిరా తో మొదలుపెట్టి సిఎస్ఐఆర్ జీవితంలోని ప్రతి ఒక్క గోళంపైనా నశించని ముద్రను వేసిందన్నారు. సరైన వర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా ‘సాంకేతిక విజ్ఞాన వ్యాపారాన్ని సులభంగా నిర్వహించగలిగే’ ఒక వేదికను సిఎస్ఐఆర్ తయారుచేయాలని, తద్వారా సాంకేతిక విజ్ఞానాలు లబ్ధిదారులకు చేరగలుగుతాయని ఆయన విజ్ఞప్తి చేశారు.

శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానాల ఫలాలు పొందనిదే ఏ దేశం అభివృద్ధి చెందలేదన్న వాస్తవానికి చరిత్రే సాక్షీభూతురాలు అని ప్రధాన మంత్రి అన్నారు. సామాన్య మానవుడికి ప్రయోజనాన్ని అందించేదే విజయవంతమైన సాంకేతిక విజ్ఞానం అని ఆయన చెప్పారు. గత 75 సంవత్సరాలకు పైగా దేశానికి సేవలు అందించినందుకు సిఎస్ఐ ఆర్ ను అభినందిస్తూ, ఈ సంస్థ నుండి భవిష్యత్తు లో మరింత ఎక్కువ సేవలను తాను ఆశిస్తున్నానన్నారు. సాంకేతిక విజ్ఞానం చోదకంగా ఉన్న ఈ శతాబ్దంలో శాస్త్ర విజ్ఞానాన్ని పౌరులతో అనుసంధానించడం ముఖ్యం అని ఆయన అన్నారు.

సిఎస్ఐఆర్ ప్రయోగ శాలల్లో పరిశోధనలు జరపడానికి విద్యార్థులకు గరిష్ఠ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం జరగాలని ప్రధాన మంత్రి అన్నారు. దేశంలో కొత్త ఔత్సాహిక పారిశ్రామికులు ఆవిర్భవించడంలో సిఎస్ఐఆర్ కీలకమైన పాత్రను పోషించవలసి ఉందని ఆయన చెప్పారు. వ్యవసాయ దిగుబడులను గురించి ప్రస్తావిస్తూ, “ప్రతి (నీటి) చుక్కకు మరింత ఎక్కువ పంట”ను సాధించాలని తాను ఎల్లప్పుడూ నొక్కిచెబుతూ వస్తున్నానని, అలాగే “ ప్రతి ఒక్క అంగుళం భూమితో పంటల గుత్తి”ని సాధించడం అనేది కూడా మరొక ధ్యేయం కావాలన్నారు.

ఆ తరువాత ప్రధాన మంత్రి విజ్ఞాన్ భవన్ లో పాఠశాల విద్యార్థులతో మాట్లాడడానికి వేదిక మీద నుండి దిగి వారి వద్దకు చేరుకొన్నారు.

***