Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిఒవిఐడి-19 కార‌ణం గా త‌లెత్తిన ప‌రిస్థితి ప‌ట్ల ప్ర‌భుత్వం పూర్తి జాగ‌రూక‌త తో ఉంద‌న్న ప్ర‌ధాన మంత్రి


సిఒవిఐడి-19 నోవ‌ల్ క‌రోనా వైర‌స్ కార‌ణం గా ఉత్ప‌న్న‌మైనటువంటి ప‌రిస్థితి ని గురించి ప్ర‌భుత్వం పూర్తి స్థాయి లో జాగ‌రూక‌త తో ఉన్నద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

అంద‌రి సుర‌క్ష కు పూచీ ప‌డే విధం గా రాష్ట్రాలు మ‌రియు మంత్రిత్వ శాఖ‌లు ర‌క‌ ర‌కాల క్రియాశీల‌మైన చ‌ర్య‌ల ను తీసుకొన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి ఈ రోజు న ట్విట‌ర్ లో పొందుప‌ర‌చిన ఒక సందేశం లో తెలిపారు.

భ‌యాందోళ‌న‌ల కు లోను కావ‌ద్ద‌ని, అత్యంత అవ‌స‌రం కాని ప్ర‌యాణాన్ని మానుకోవాల‌ని, అలాగే భారీ స‌మూహాలు గా ఏర్ప‌డ‌వద్దని ప్ర‌జ‌ల కు ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం లోని ఏ మంత్రీ రాబోయే రోజుల లో విదేశాల కు ప్ర‌యాణించ‌రు అని కూడా ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.